ఐటీ, ఆటో షేర్ల దూకుడు..సెన్సెక్స్‌ 49,000+ - indices ended at fresh record closing
close

Published : 11/01/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ, ఆటో షేర్ల దూకుడు..సెన్సెక్స్‌ 49,000+

ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఐటీ, ఆటో షేర్ల అండతో భారీ లాభాల్లో ముగిశాయి. మూడో త్రైమాసిక ఫలితాల్లో టీసీఎస్‌ అదరగొట్టిన నేపథ్యంలో ఆ కంపెనీతో పాటు మిగిలిన ఐటీ కంపెనీల షేర్లూ రాణించాయి. వాహన షేర్లు సైతం రాణించడంతో తొలిసారి సెన్సెక్స్‌ 49 వేల మార్కును దాటింది. నిఫ్టీ 14,500 మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది.

ఉదయం సెన్సెక్స్‌ 49,100 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజంతా అదే దూకుడుతో కొనసాగిస్తూ చివరికి 486.81 పాయింట్ల లాభంతో 49,269.32 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 137.50 పాయింట్ల లాభంతో 14,484.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.40గా ఉంది. నిఫ్టీలో టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో షేర్లు ప్రధానంగా రాణించాయి. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇక రంగాల వారీగా చూస్తే ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించగా.. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు డీలాపడ్డాయి.

ఇవీ చదవండి..
ఈపీఎఫ్ఓలో బ్యాంక్ వివ‌రాలు అప్‌డేట్ చేసుకోండి 
ప్యాసెంజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాల్లో 24% వృద్ధి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని