stock market: ఊగిసలాట ధోరణిలో సూచీలు - indices open flat
close

Updated : 08/07/2021 09:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: ఊగిసలాట ధోరణిలో సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం 9.24 సమయంలో సెన్సెక్స్‌ 25 పాయింట్ల లాభంతో 53,080 వద్ద, నిఫ్టీ 1 పాయింటు లాభంతో 15,880 వద్ద ఉన్నాయి. నవభారత్‌ వెంచర్స్‌, కేపీఆర్‌ మిల్‌, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, నోవార్టిస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్లు లాభాల్లో ఉండగా..  బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, సోమనీ సిరామిక్స్‌, జేకే పేపర్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

లోహరంగ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా.. బ్యాంకింగ్‌ సూచీ అత్యధిక నష్టాల్లో ఉంది.  నేడు టాటా కన్సల్టెన్సీ ఫలితాలను ప్రకటించనుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు కుంగి రూ.74.45 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.266 పెరిగి రూ.47,959 వద్ద, వెండి కిలో రూ.137 తగ్గి రూ.69,375 వద్ద కొనసాగుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని