విద్యారుణం- బ్యాంకులు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు  - interest-rates-on-education-loans
close

Updated : 22/03/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యారుణం- బ్యాంకులు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు 

విద్యార్థులు త‌మ ల‌క్ష్యాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చేరుకునేందుకు నాణ్య‌మైన‌ ఉన్న‌త విద్య ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అయితే ప్ర‌స్తుతం పెరుగుతున్న ద్ర‌వ్యోల్భ‌ణం కార‌ణంగా ఇందుకు అయ్యే ఖ‌ర్చు భారీగా పెరిగింది. దీంతో సామాన్యులు ఉన్నత విద్య వ్యయాన్ని భరించడం చాలా కష్టమవుతోంది. ఇటువంటి ప‌రిస్థితుల‌లో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన ఉన్న‌త విద్యను అందించేంద‌కు ఏకైక మార్గం విద్యా రుణం అనే చెప్పాలి.  స్వ‌దేశంతో పాటు, విదేశాల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. 

విద్యార్థి, అత‌ని/ ఆమె త‌ల్లిదండ్రులు విద్యారుణం తీసుకోవ‌చ్చు. కోర్సు పూర్తైన తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణం, వ‌డ్డీ రేట్లు, ఈఎమ్ఐ, ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులు బ్యాంకు నుంచి బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి.

విద్యా రుణం తీసుకునే ముందు వ‌డ్డీ రేట్లు పోల్చడం చాలా ముఖ్యం. కార‌ణం, ఇది ఈఎమ్ఐ లను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎసీఐ) నుంచి ఎనిమిదేళ్ల కాల‌ప‌రిమితితో రూ .10 లక్షల విద్య రుణం తీసుకుంటే, రూ .13,559 వ‌ర‌కు ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే మొత్తాన్ని అంతే కాల‌ప‌రిమితికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి తీసుకుంటే ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి మొత్తం రూ .14,937. 

వ‌డ్డీ రేట్ల‌లో ఉన్న వ్యత్యాసం కార‌ణంగా ఈఎమ్ఐ మారుతుంది. విద్యారుణంపై ఎస్‌బీఐ ప్ర‌స్తుతం వ‌ర్తింప చేస్తున్న‌ వ‌డ్డీ రేటు 6.85 శాతం కాగా, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ 9.55శాతం వ‌డ్డీ విధిస్తుంది. అలాగే విద్యారుణంపై ప్ర‌స్తుతం వివిధ బ్యాంకులు అమ‌లు చేస్తున్న వ‌డ్డీ రేట్ల‌ను ఇప్పుడు చూద్దాం. 


 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని