ఐఎస్‌బీ దేశంలోనే నెం.1 - isb no 1 in india
close

Updated : 21/04/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఎస్‌బీ దేశంలోనే నెం.1

ఎస్‌సీఎం జర్నల్‌ జాబితా

హైదరాబాద్‌ (రాయదుర్గం), న్యూస్‌టుడే: ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ పరిశోధనల విశ్వవిద్యాలయాలు, బిజినెస్‌ స్కూళ్లకు సంబంధించిన ర్యాంకింగ్‌లో దేశంలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ మేనేజ్‌మెంట్‌ పరిశోధనా వర్సిటీలు, బిజినెస్‌ స్కూల్స్‌, సంస్థలకు ర్యాంకింగ్‌ ఇచ్చే ‘ది ఎస్‌సీఎం జర్నల్‌ లిస్ట్‌’ సంస్థ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ ఈ ఘనత సాధించింది. ప్రపంచ స్థాయి వంద సంస్థల్లో 64వ ర్యాంకులో నిలిచింది. గత ఐదేళ్ల (2015-2020) కాలంలో ప్రముఖ పరిశోధన జర్నల్స్‌లో సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పరిశోధన పేపర్ల ప్రచురణలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌సీఎం జర్నల్‌ లిస్ట్‌ ర్యాంకులను ప్రకటిస్తుంది. సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌లో విశ్లేషణ, అనుభవపూర్వక రంగాలను ఆ సంస్థ పరిశీలిస్తుంది. గత ఐదేళ్లలో ఐఎస్‌బీ ఉత్తమ మేనేజ్‌మెంట్‌ పరిశోధన జర్నల్స్‌లో విశ్లేషణాత్మక ప్రచురణలలో ముందజంలో నిలిచింది. ఎస్‌సీఎం జర్నల్‌ లిస్ట్‌ ర్యాంకింగ్స్‌కు పరిగణించిన జర్నల్స్‌లో ఫైనాన్షియల్‌ టైమ్స్‌, యూటీ-డల్లాస్‌ లిస్ట్స్‌, ప్రముఖ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్స్‌ పత్రికలతోపాటు ఎపిక్స్‌ (జర్నల్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌), సీఎస్‌సీఎంపీ (బిజినెస్‌ లాజిస్టిక్స్‌ జర్నల్‌), డెసిషన్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌(డెసిషన్‌ సైన్స్‌ జర్నల్‌), ఐఎస్‌ఎం (సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ జర్నల్‌) ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని