జాక్‌మా ఎక్కడ? - jack ma suspected missing for 2 months
close

Updated : 04/01/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాక్‌మా ఎక్కడ?

రెండు నెలలుగా కనబడని చైనా బిలియనీర్‌

బీజింగ్‌: ప్రభుత్వానికి సలహాలివ్వబోయి కష్టాలు కొనితెచ్చుకున్న చైనా టెక్‌ బిలియనీర్‌, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. గత రెండు నెలలుగా బాహ్యప్రపంచానికి కన్పించట్లేదు. ప్రభుత్వంతో వివాదం నడుస్తున్న సమయంలో ఆయన అదృశ్యం కావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. 

దాదాపు రెండు నెలల క్రితం చైనా పాలకులకు సలహాలు ఇవ్వబోయి వారి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబరులో తాను నిర్వహిస్తున్న టాలెంట్‌ షో ‘ఆఫ్రికాస్‌ బిజినెస్‌ హీరోస్‌’ ఫైనల్‌ ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాల్సి ఉండగా.. ఆయన రాలేదు. జాక్‌ మా స్థానంలో అలీబాబా ఎగ్జిక్యూటివ్‌ ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అంతేగాక, ఆ షో వెబ్‌సైట్‌ నుంచి ఆయన ఫొటోలను తొలగించినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత నుంచి కూడా జాక్‌ మా ఎప్పుడూ బయటి ప్రపంచానికి కనబడలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారన్నది మిస్టరీగా మారింది. అయితే, షెడ్యూల్‌ వివాదం కారణంగా ఫైనల్‌ ఎపిసోడ్‌కు జాక్‌ మా రాలేదని అలీబాబా అధికారి ప్రతినిధి చెప్పినట్లు తెలుస్తోంది. 

గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్‌ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్‌.. ఆయనపై ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, ఆయనకు చెందిన యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను అడ్డుకొంది. దీంతో ఆలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా ఆస్తులు కూడా కరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఆయన కన్పించకుండా పోవడం గమనార్హం. 

ఇవీ చదవండి..

జాక్‌మా ఉచిత సలహా బెడిసికొట్టి..

జాక్‌మా.. 2 నెలలు.. 11 బిలియన్‌ డాలర్ల నష్టం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని