అమెజాన్‌ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్‌ - jeff bezos to step down as ceo of amazon in this year
close

Updated : 04/02/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ సీఈవోగా తప్పుకోనున్న బెజోస్‌

వాషింగ్టన్‌: అపరకుబేరుడు, టెక్‌ దిగ్గజం, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తన సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది చివరికల్లా సీఈవో పదవి నుంచి వైదొలగనున్నట్లు స్వయంగా ప్రకటించారు. బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జాస్సీ సీఈవోగా నియామకం కానున్నారు. 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు అ‌మెజాన్‌ను ప్రారంభించిన బెజోస్‌.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ఈ సందర్భంగా బెజోస్‌ తన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్‌ అంటే ఒక ఆవిష్కరణగా పేర్కొన్న బెజోస్‌..  ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చానని, ఇక ఈ పదవి నుంచి మారడం సరైన సమయంగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికల్లా పదవి నుంచి తప్పుకొని ఆండీ జాస్సీకి పగ్గాలు అప్పజెప్పనున్నట్లు తెలిపారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్న బెజోస్‌.. బెజోస్‌ ఎర్త్ ఫండ్‌, బ్లూ ఆరిజిన్‌‌, అమోజాన్‌ డే 1 ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ‌

సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు చేసిన ప్రకటనతో వాల్‌స్ట్రీట్‌తో పాటు అమెరికా వ్యాపార వర్గాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాయి. అయితే అమెజాన్‌ వ్యాపారంపై ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక నూతన సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జాస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా చేరారు. 2003లో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ఏర్పాటులో కీలకమయ్యారు. 

ఇదీ చదవండి..
అమెరికాను కమ్మేసిన మంచు తుపాను!మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని