1990లో తొలిసారి 1000 మార్క్‌ను దాటి..
ముంబయి: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్.. నేడు చరిత్ర సృష్టించింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి 50,000 మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో అంతర్జాతీయ మార్కెట్లు ‘జో’ష్ లో ఉండటం, దేశంలో విదేశీ పెట్టుబడులు పెరగడం, బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో దలాల్ స్ట్రీట్ కొనుగోళ్లతో కళకళలాడుతోంది. ఫలితంగా సెన్సెక్స్ కొత్త రికార్డుల్లో దూసుకెళ్తోంది.
దాదాపు 30 ఏళ్ల క్రితం 1990లో తొలిసారిగా 1000 మార్క్‌ను దాటిన సెన్సెక్స్.. అంచెలంచెలుగా 50వేల మార్క్‌కు చేరింది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, సత్యం లాంటి కుంభకోణాలు.. జీఎస్టీ అమలు, నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా మహమ్మారి.. ఇలా ఎన్నో ఘటనలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. అదే సమయంలో మోదీ ప్రభుత్వ సంస్కరణలు, కొవిడ్ టీకాలకు ఆమోదం వంటి పరిణామాలు సూచీలను నిలబెట్టాయి. అలా నేడు సెన్సెక్స్ 50వేలకు చేరింది. ఈ సందర్భంగా సూచీ ప్రస్థానాన్ని ఓసారి క్షుణ్ణంగా చూస్తే..
* 1990 జులై 25న సానుకూల వర్షపాతం, కార్పొరేట్ ఫలితాలతో సెన్సెక్స్ తొలిసారిగా 1000 మార్క్‌ను దాటింది.
* అయితే సెన్సెక్స్ 10వేల మార్క్‌ను చేరడగానికి దాదాపు 16ఏళ్లు పట్టింది. 2006 ఫిబ్రవరి 7న 10,000 మైలురాయిని దాటింది.
* ఆ తర్వాతి సంవత్సరమే అంటే 2007 డిసెంబరు 11న సూచీ 20,000 మార్క్‌ను చేరుకుంది.
* మళ్లీ ఎనిమిదేళ్లకు 2015 మార్చి 4న రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను తగ్గించడంతో 30వేల మైలురాయిని దాటింది.
* ఆ తర్వాత నుంచి సెన్సెక్స్ వేగం పుంజుకుంది. 2019 మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో తొలిసారిగా 40వేల మార్క్‌ను చేరింది.
9 నెలల్లో 93శాతం పెరిగి..
గతేడాది మార్చిలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సెన్సెక్స్ కూడా తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఒకదశలో గతేడాది మార్చి నెలలో 25,638.90కి పడిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన సూచీ.. ఇటీవల గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. కేవలం 9 నెలల్లోనే సూచీ 93శాతం పెరగడం విశేషం. తాజాగా సెన్సెక్స్ 50వేల మైలురాయిని చేరడంతో బీఎస్ఈ తన ట్విటర్ ఖాతాలో సెన్సెక్స్ ప్రయాణానికి సంబంధించి ఓ ఛార్ట్‌ను పోస్ట్ చేసింది.
ఇవీ చదవండి..
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?