​​​​​​LIC పాలసీదారులకు గమనిక - lic to have five working days starting from may 10
close

Published : 06/05/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​LIC పాలసీదారులకు గమనిక

దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా కంపెనీ LIC వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనుంది. ఇకపై శనివారం LIC కార్యాలయాలు పనిచేయబోవని ఆ సంస్థ పబ్లిక్‌ నోటీసులో పేర్కొంది. మే 10 నుంచి ఐదు రోజుల పని విధానం అమల్లోకి రానుంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్ల పరిష్కారంలో భాగంగా ప్రతి శనివారం సెలవు ప్రకటించాలన్న డిమాండ్‌కూ కేంద్రం ఏప్రిల్‌ 15న ఆమోదం తెలిపింది. దీంతో మే 10 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే LIC కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయనున్నాయని ఎల్‌ఐసీ పేర్కొంది. పాలసీదారులు, ఇతర భాగస్వామ్యపక్షాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని