గృహ రుణాలు - వ‌డ్డీ రేట్లు - looking for cheapest home loan
close

Updated : 21/10/2021 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహ రుణాలు - వ‌డ్డీ రేట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌తి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక బ‌ల‌మైన కోరిక‌. ఒక‌ప్పుడు వ్యాపారులు, వృత్తి నిపుణులు మ‌ధ్య వ‌య‌స్సులోనే ఇంటిని నిర్మించుకునేవారు. ఉద్యోగులు అయితే ఉద్యోగ‌ విర‌మ‌ణ‌ త‌ర్వాత సొంతింటి గురించి ప్రణాళిక వేసుకునేవారు. కానీ ఇప్పుడు 35 సంవ‌త్స‌రాల్లోపు ఉద్యోగులు గృహ య‌జ‌మాని అవుతున్నారు. గ‌త 15 ఏళ్ల‌లో అతి త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గృహ రుణం పొంద‌డానికి స‌రైన స‌మ‌యం ఇదేన‌ని స్థిరాస్తి వ‌ర్గాల అభిప్రాయం. గృహ రుణాన్ని తీసుకునేట‌ప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు, రుణ చెల్లింపు కాల‌వ్య‌వ‌ధిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. సాధార‌ణంగా పండుగ సీజ‌న్ల‌లో చాలా బ్యాంకులు ఆఫ‌ర్లు ఇస్తుంటాయి. ముఖ్యంగా ప్రాసెసింగ్ ఫీజుల‌లో ఆక‌ర్ష‌ణీయ‌మైన రాయితీల‌ను అందిస్తాయి. వీటిని స‌ద్వినియోగం చేసుకొంటే మంచిది. స్తిరాస్థి వ్యాపారులు కూడా పండుగ‌ల సీజ‌న్‌ల‌లో రాయితీలు ప్ర‌క‌టిస్తుంటారు.

ద‌ర‌ఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌, నెల‌వారీ ఆదాయం, ఉద్యోగ ప్రొఫైల్‌, ప‌నిచేసే కంపెనీ ప్రొఫైల్ మొద‌లైన వాటి ఆధారంగా వివిధ బ్యాంక్‌లు ఆఫ‌ర్ చేసే గృహ రుణ ఆఫ‌ర్ల‌ను పొంద‌డానికి ఆన్‌లైన్‌లో ఆయా బ్యాంక్‌ల వెబ్‌సైట్స్‌ను ఈ రుణాలు తీసుకునేవారు త‌ప్ప‌క సంద‌ర్శించాలి. కొన్ని బ్యాంకులు రుణ చెల్లింపు కాల‌వ్య‌వ‌ధులు 25, 30 ఏళ్ల వ‌ర‌కు కూడా అందిస్తున్నాయి. ఎక్కువ కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకోవ‌డం వ‌ల్ల ‘ఈఎంఐ’లు తక్కువగా ఉంటాయి. ‘ఈఎంఐ’ చెల్లింపులకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.  కానీ అధిక వ‌డ్డీ వ్య‌యం అవుతుంది. సాధార‌ణంగా గృహ రుణం తీసుకునే వారి నెల‌వారీ ఆదాయంలో ‘ఈఎంఐ’ 50% లోపు ఉండేలా బ్యాంకులు ప్రాధాన్య‌ం ఇస్తున్నాయి. అందువ‌ల్ల గృహ రుణ ద‌ర‌ఖాస్తుదారులు ఆన్‌లైన్లో గానీ బ్యాంకును గానీ సంప్ర‌దించి గృహ రుణం ఎంత రాగ‌ల‌దు? రుణ చెల్లింపు కాల‌వ్య‌వ‌ధి ఎన్ని సంవ‌త్స‌రాలు అనేది చూసుకోవాలి.

కొన్ని ప్ర‌ముఖ బ్యాంకుల వివిధ గృహ రుణ మొత్తాల‌కు వ‌డ్డీ రేట్లు తెలిపే ప‌ట్టిక దిగువ ఉంది ప‌రిశీలించ‌గ‌ల‌రు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని