ధరలు పెంచిన మహీంద్రా - mahindra increases prices of vehicles
close

Published : 08/01/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధరలు పెంచిన మహీంద్రా

దిల్లీ: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌, వేరియంట్‌ని బట్టి గరిష్ఠంగా 1.9శాతం మేర ధరలు పెరిగినట్లు వెల్లడించింది. వాహనాన్ని బట్టి రూ.4,500 నుంచి 40,000 వరకు పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది. 2020 డిసెంబరు 1 నుంచి 2021, జనవరి 7 మధ్య బుక్‌ చేసుకున్న కొత్త థార్‌ కార్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నేటి నుంచి జరిగే థార్‌ బుకింగ్‌లకు.. డెలివరీ నాటి ధరలు వర్తిస్తాయని తెలిపింది.

నిర్వహణ ఖర్చులు, ముడిసరకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం సీఈవో విజయ్ నక్రా తెలిపారు. ధరలు తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని.. అందులో భాగంగా చాలా కాలం నుంచి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చామని తెలిపారు. కానీ, రోజురోజుకీ నిర్వహణ ఖర్చులు భారంగా మారుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ఇవీ చదవండి..

టీసీఎస్‌ లాభం 8% పెరిగే అవకాశం

7 సీట్ల హెక్టార్‌: ఎంజీ మోటార్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని