లాభాల్లో ముగిసిన మార్కెట్లు - market
close

Published : 28/12/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు మరోసారి లాభాల్లో ముగిశాయి. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీకి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలపడం, కరోనా వ్యాక్సిన్‌పై ఆశాభావ దృక్పథం నెలకొనడంతో సెంటిమెంట్‌ బలపడింది. దీంతో ఆసియా మార్కెట్లు సహా దేశీయ మార్కెట్లు కూడా రాణించాయి. దీనికి తోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు రాణించడంతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సూచీలు మరోసారి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.

ఉదయం 47,284 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 380.21 పాయింట్ల లాభంతో 47,353.75 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 123.95 పాయింట్ల లాభంతో 13,873.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.49 గా ఉంది. నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు ప్రధానంగా రాణించాయి. సన్‌ఫార్మా, హిందూస్థాన్‌ యూనీలీవర్‌, శ్రీసిమెంట్స్‌, బ్రిటానియా, సిప్లా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఫార్మా రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి.

ఇవీ చదవండి..
మనసు మార్చుకున్న ట్రంప్‌!
నేటి నుంచి అందుబాటులోకి రానున్న‌ 9వ విడత గోల్డ్ బాండ్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని