మార్కెట్లోకి మారుతీ కొత్త స్విఫ్ట్‌ - maruti drives in new swift with price starting at rs 5.73 lakh
close

Published : 24/02/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి మారుతీ కొత్త స్విఫ్ట్‌

దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తన విజయవంతమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.5.73 లక్షల నుంచి రూ.8.41 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించింది. వాహనదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతతో కొత్త స్విఫ్ట్‌-2021ను తీసుకొచ్చినట్లు ఎంఎస్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2005లో విడుదల చేసిన ఈ మోడల్‌ తన పనితీరుతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఎంఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 24 లక్షల మంది వినియోగదారులకు చేరువైందన్నారు.

కొత్త స్విఫ్ట్‌లో కె-సిరీస్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు శ్రీవాస్తవ తెలిపారు. స్పోర్టియర్‌ డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌, భద్రతాపరమైన ఫీచర్లతో పాటు కొత్త స్విఫ్ట్‌ మంచి మైలైజీని అందిస్తుందని తెలిపారు. ఆటోమెటిక్‌, మాన్యువల్‌ వేరియంట్లలో ఇది లభిస్తుందన్నారు. మాన్యువల్‌ మోడల్‌ ప్రారంభ ధర రూ.5.73 లక్షలు కాగా.. గరిష్ఠ ధర రూ.7.91లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.6.86 లక్షలు కాగా.. గరిష్ఠ ధర రూ.8.41 లక్షలుగా వెల్లడించింది. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌ మోడల్‌ లీటరుకు 23.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, అదే ఆటోమేటిక్‌ వెర్షన్‌ 23.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంది.

ఇవీ చదవండి...

2.6 ల‌క్ష‌ల వినియోగ‌దారులకు పేటీఎమ్ రీఫండ్

బజాజ్‌ పల్సర్‌ 180 రిటర్న్స్


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని