Q2 Results: మారుతీ లాభంలో 66% క్షీణత! - maruti q2 net dips 66 pc
close

Published : 27/10/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Q2 Results: మారుతీ లాభంలో 66% క్షీణత!

దిల్లీ: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం తగ్గింది. 66 శాతం క్షీణించి రూ.487 కోట్లుగా నమోదైంది. వ్యయభారం పెరగడంతో పాటు చిప్‌ల కొరత లాభాల క్షీణతకు దారి తీసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,420 కోట్లు. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.18,756 కోట్లుగా ఉండగా.. ఈసారి అది రూ.20,551 కోట్లకు చేరింది.

వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమ్మకాలు 3 శాతం తగ్గి 3,79,541 యూనిట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇవి 3,93,130 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ విపణిలో విక్రయాలు 3,20,133 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మాత్రం 59,408 యూనిట్లకు చేరాయి. కంపెనీ చరిత్రలో రెండో త్రైమాసికంలో ఎగుమతులు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మొత్తం 1.16 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. చిప్‌ల కొరత వల్ల సాధ్యం కాలేదని సంస్థ పేర్కొంది. స్టీల్‌, అల్యూమినియం సహా ఇతర కీలక లోహాల ధరలు పెరగడం ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 7,33,155 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ఎగుమతులు 1,04,927 యూనిట్లుగా నమోదయ్యాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని