2020లో స్విఫ్ట్‌.. ది బెస్ట్‌ - maruti suzukis premium hatchback swift indias best-selling car model in 2020
close

Updated : 23/01/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2020లో స్విఫ్ట్‌.. ది బెస్ట్‌

దిల్లీ: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీకి చెందిన ప్రీమియం హాచ్‌‌బ్యాక్‌ స్విఫ్ట్‌ కార్ల విక్రయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2020లో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్‌గా స్విఫ్ట్‌ అగ్రస్థానంలో నిలిచిందని సంస్థ శనివారం వెల్లడించింది. గతేడాది మారుతి సుజుకీ 1,60,700 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది.

2005లో మారుతి ఈ మోడల్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ప్రతిఏటా అత్యధికంగా అమ్ముడుపోయే కార్ల జాబితాలో స్థానం పొందుతూనే ఉంది. గతేడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ 1,60,700 యూనిట్లు అమ్ముడయ్యాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. దీంతో 2020లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిందన్నారు. స్విఫ్ట్‌ కస్టమర్లలో 53శాతానికి పైగా 35ఏళ్లలోపు వారేనట. గతేడాది ఈ మోడల్‌ విక్రయాలు 23లక్షల యూనిట్ల మైలురాయిని దాటిన విషయం తెలిసిందే. 

ఇక గతేడాది అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతికి చెందిన ఆల్టో రెండో స్థానంలో ఉంది. ఇక టాప్‌10లో ఉన్న మోడళ్లలో ఏడు మారుతివే కావడం విశేషం. బాలెనో, వేగనార్‌, డిజైర్‌, ఎకో, బ్రెజా టాప్‌ సెల్లర్ల జాబితాలో ఉండగా.. హ్యుందాయ్‌ క్రెటా ఏడో స్థానంలో, కియా సెల్టోస్‌ ఎనిమిదిలో, హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 తొమ్మిదో స్థానంలో నిలిచాయి. 

ఇదీ చదవండి..

పెట్రోల్‌పై సుంకం తగ్గిస్తారా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని