7 కంపెనీలు..7 రోజులు..రూ.1.40లక్షల కోట్లు - mcap of 7 firms jump over rs lakh cr
close

Published : 14/02/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7 కంపెనీలు..7 రోజులు..రూ.1.40లక్షల కోట్లు

దిల్లీ: మార్కెట్లో అత్యంత విలువ కలిగిన తొలి పది కంపెనీల్లో ఏడింటి విలువ గతవారం గణనీయంగా వృద్ధి చెందింది. గడిచిన వారం రోజుల్లో ఈ ఏడు కంపెనీల మార్కెట్ విలువ రూ.1,40,430.43 కోట్లు పెరగడం గమనార్హం. మార్కెట్ల జోరుతో లాభపడ్డ షేర్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ముందువరుసలో ఉండగా.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ల మార్కెట్‌ విలువ తగ్గడం గమనార్హం. గతవారం సెన్సెక్స్‌ 812.67 పాయింట్లు ఎగబాకిన విషయం తెలిసిందే.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.74,329 కోట్లు పెరిగి.. 12,94,038.34 కోట్లకు చేరింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 22,943.86 కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.15,888.27 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.12,439.33 కోట్లు, టీసీఎస్‌ రూ.12,420.4 కోట్లు, బజాజ్‌ ఫినాన్స్‌ రూ.2,274.77 కోట్లు, ఎస్‌బీఐ విలువ రూ.133.87 కోట్లు పెరిగింది.

ఇక మార్కెట్‌ విలువ ఆధారంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి...

ఆరో రోజూ పెట్రో ధరలు పైపైకే..

రుణ ఆస్తుల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ రికార్డు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని