రికార్డు స్థాయికి బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ - mcap of bse listed companies zoom to fresh record high
close

Published : 08/01/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రికార్డు స్థాయికి బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ

ముంబయి: బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ నేడు జీవన కాల గరిష్ఠానికి చేరింది. స్టాక్​మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీల విలువ రూ. 195.21 లక్షల కోట్లకు పైగా నమోదయింది. దీంతో బీఎస్ఈ చరిత్రలో శుక్రవారం సరికొత్త కొత్త రికార్డు​నమోదైంది.

రెండు రోజుల నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్​సూచీలు నేడు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓ దశలో 471.31 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 48,564 వద్ద ట్రేడయింది. ఈ నేపథ్యంలో కంపెనీల మార్కెట్ల విలువ ఒక్కసారిగా పెరిగింది. గత సంవత్సరం తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న సెన్సెక్స్‌ ఎట్టకేలకు 15.7 శాతం మేర పెరిగిన విషయం తెలిసిందే. 2020లో ఈక్విటీలో మదుపు చేసిన వారు రూ. 32.49 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు.

మధ్యాహ్నం 1:55 గంటల సమయంలో సెన్సెక్స్‌ 463 పాయింట్లు ఎగబాకి 48,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 14,283 వద్ద కొనసాగుతోంది. బైడెన్‌ ఎన్నికతో ఉద్దీపనపై ఆశలు పెరిగి అమెరికా మార్కెట్లు గురువారం కళకళలాడాయి. ఈ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నేడు భారీగా దూసుకెళ్లాయి. దీంతో దేశీయ సూచీలు సైతం పెద్ద ఎత్తున లాభపడ్డాయి.

ఇవీ చదవండి..

ధరలు పెంచిన మహీంద్రా

ఎలాన్‌ మస్క్‌ ‘వింత’ స్పందన


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని