వారంలో రూ.1.23 లక్షల కోట్లు ఆవిరి! - mcap of eight of top 10 most valued firms tanks
close

Published : 21/02/2021 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో రూ.1.23 లక్షల కోట్లు ఆవిరి!

దిల్లీ: గత వారం స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న నేపథ్యంలో నమోదిత కంపెనీల సంపద భారీగా ఆవిరైంది. మార్కెట్‌ విలువ ఆధారంగా అత్యంత విలువైన 10 కంపెనీల్లో ఎనిమిదింటి మొత్తం విలువ రూ.1,23,670.47 కోట్లు తగ్గింది. తొలి పది కంపెనీల జాబితాలో ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఎస్‌బీఐ మినహా మిగిలినవన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. గతవారం సెన్సెక్స్‌ 654.54 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

టీసీఎస్‌ సంపద రూ.44,672.14 కోట్లు తరిగిపోయి రూ.11,52,770.11 కోట్లకు చేరింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ సంపద రూ.23,964.99 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.16,146.38 కోట్లు, హెచ్‌యూఎల్‌ రూ.14,273.56 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.9,408.05 కోట్లు, ఇన్ఫోసిస్ సంపద రూ.7,735.21 కోట్లు తగ్గిపోయింది. వీటికి భిన్నంగా ఆర్‌ఐఎల్‌ విలువ రూ.24,914 కోట్లు పెరిగి.. రూ.13,18,952.34 కోట్లకు చేరింది. అలాగే ఎస్‌బీఐ ఈ వారం అదనంగా రూ.5,488.63 కోట్ల సంపద పోగుచేసుకొని దాని మార్కెట్‌ విలువను రూ.3,56,404.36 కోట్లకు పెంచుకుంది.

ఇక మార్కెట్‌ విలువ ఆధారంగా ఎప్పటిలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని