తయారీదారులను వేధిస్తున్న గ్రే మార్కెట్ బెడద
ఇంటర్నెట్ డెస్క్: విదేశాలకు భారీగా మొబైల్ ఫోన్లను ఎగుమతి చేస్తున్న తరుణంలో దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంలో అర్థం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రే మార్కెట్‌ను నివారించేందుకు మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై వచ్చే బడ్జెట్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని దేశీయ మొబైల్ మార్కెట్ రంగం కేంద్రాన్ని కోరుతోంది. 2021-22 బడ్జెట్లో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. 20 శాతం దిగుమతి సుంకం తగ్గింపు లేదా ఒక్క మొబైల్‌పై రూ.4 వేల తగ్గింపు డిమాండ్లలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణించాలని సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీని వల్ల దేశీయ మొబైల్ తయారీ రంగం బలోపేతమవుతుందని వెల్లడించింది. తద్వారా ప్రపంచ సంస్థలతో పోటీ పడొచ్చని పేర్కొంది.
దేశీయ మొబైల్ తయారీదారులు ప్రస్తుతం విదేశాలకు లక్షల సంఖ్యలో మొబైల్ ఫోన్లను ఎగుమతి చేస్తున్నారు. ఈ తరుణంలో అధిక దిగుమతి సుంకాలు ఉండటంతో వ్యాపారం కష్టతరంగా మారిందని నిపుణులు అంటున్నారు. ఓ అంచనా ప్రకారం 2018-19లో 3.8 బిలియన్ డాలర్ల మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసి ప్రపంచంలోనే అత్యధికంగా ఫోన్లను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం కింద పెద్ద సంస్థలు సైతం దేశంలో ఉత్పత్తి ప్లాంట్ల స్థాపనకు ముందుకు వస్తున్నాయి. పీఎల్ఐ కింద సామ్సంగ్ సంస్థ సహా యాపిల్ ఫోన్ల తయారీ కాంట్రాక్టును పొందిన ఫాక్స్‌కాన్ హోన్ హయ్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి సంస్థలు కొత్త ప్లాంట్ల స్థాపనకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
అయితే మొబైల్ తయారీదారులను గ్రే మార్కెట్ బెడద వేధిస్తోంది. అనధీకృత సరఫరా వ్యవస్థ ద్వారా లావాదేవీలు జరగడాన్ని గ్రే మార్కెట్ అంటారు. అధిక దిగుబడి సుంకాల వల్ల గ్రే మార్కెట్ వృద్ధి చెందుతుంది. దేశంలో ప్రస్తుతం హైఎండ్ ఫోన్ల విక్రయాలు 5 శాతం వరకు ఉన్నాయి. యాపిల్ ఫోన్లను ఉదాహరణగా తీసుకుంటే.. ఒక హైఎండ్ యాపిల్ ఫోన్ భారత్‌లోకంటే దుబాయ్‌లో రూ.40 వేల వరకు తక్కువగా వస్తోంది. ఇది వినియోగదారుడి దృష్ట్యా పెద్దమొత్తం. ఇలాంటి పరిస్థితుల్లోనే వినియోగదారులు గ్రే మార్కెట్ వైపు చూస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా అనంతర కాలంలో ఈ గ్రే మార్కెట్‌ను కట్టడిచేసి మొబైల్ మార్కెట్ రంగంలో పోటీతత్వం పెరిగేలా చూడాలని వారు అభిప్రాయపడుతున్నారు.
భారత్‌లో తయారీని ప్రోత్సహించేందుకు ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీని 2018-19 బడ్జెట్లో 15 నుంచి 20 శాతానికి పెంచారు. అనంతరం 2019-20 బడ్జెట్లో అదనంగా 10 శాతం సంక్షేమ సెస్‌ను విధించారు. దీంతో దిగుమతి సుంకాలు భారీగా పెరిగాయి. తద్వారా మొబైల్ ఫోన్ల రేట్లు కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దిగుమతి సుంకాలను తగ్గించాలని దేశీయ మొబైల్ మార్కెట్ రంగ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఇవీ చదవండి..
‘పెట్రోల్’పై సుంకం తగ్గిస్తారా? | సీతమ్మా.. రాయితీలు ఇవ్వమ్మా |
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?