పర్యావరణహిత బొమ్మల్ని తయారు చేయండి - modi asks toy manufacturers to use less plastic
close

Published : 27/02/2021 22:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పర్యావరణహిత బొమ్మల్ని తయారు చేయండి

ఆటబొమ్మల తయారీదార్లకు మోదీ పిలుపు

దిల్లీ: స్వదేశీ ఆట బొమ్మలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర జౌళి శాఖ నిర్వహిస్తోన్న ‘ది ఇండియా టాయ్​ ఫెయిర్​-2021’ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భార‌త్‌లో తయారయ్యే బొమ్మలకు వాడే రంగుల‌న్నీ స‌హ‌జ‌మైన‌వ‌ని, సుర‌క్షిత‌మైన‌వ‌ని, పర్యావరణహితమైనవని తెలిపారు. బొమ్మల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని తయారీదార్లను కోరారు. పునర్వినియోగానికి అనువైన పదార్థాల్ని వినియోగించాలని సూచించారు. అలాగే భార‌తీయుల సైకాల‌జీ, జీవావ‌ర‌ణానికి త‌గ్గిన‌ట్లు ఆట బొమ్మలు ఉండాలన్నారు. బొమ్మల ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసే యోచనలో త‌మ ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భార‌తీయ బొమ్మలకు మంచి డిమాండ్ ఉంద‌ని తెలిపారు. ‘మేడిన్ ఇండియా’ వలే హ్యాండ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మలకు కూడా మార్కెట్ ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశంలో వివిధ ప్రాంతాల్లో బొమ్మల తయారీలో ఉన్న పలువురితో వర్చువల్‌గా ముచ్చటించారు.

నేడు ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 2తో ముగియనుంది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా తయారీదార్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ టాయ్‌ ఫెయిర్‌లో భారతీయ సంప్రదాయ బొమ్మలతో పాటు, ఆధునిక ఆట బొమ్మలు, విద్యుత్​ బొమ్మలు, పజిల్స్​, ఇతర ఆట బొమ్మలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో వెబినార్లు కూడా నిర్వహించనున్నారు.  బొమ్మల తయారీ రంగంపై ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ వక్తలు.. వెబినార్లలో ప్రసంగించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా బొమ్మల తయారీ రంగంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా ఎలా మార్చాలో.. పరిశ్రమలు, ప్రభుత్వం ఈ వేదిక ద్వారా చర్చించనున్నారు.

ఇవీ చదవండి..

అమెరికా అప్పెంతో తెలుసా?

మరోసారి పెరిగిన బుల్లెట్‌ 350 ధర!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని