పురపాలనకు బలం..! - municipalities may obtain up to rs 2 lakh cr centre funding
close

Updated : 26/01/2021 14:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురపాలనకు బలం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి బడ్జెట్‌లో కీలక పురపాలక సంఘాలకు నిధుల కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన శైలి మెరుగుపర్చేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. వచ్చే ఐదేళ్లలో పురపాలక సంఘాలకు రూ.2లక్షల కోట్లను కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ సారి బడ్జెట్‌లో పట్టణ ప్రాంతాలకు నిధులతోపాటు సంస్కరణలు కూడా చేపట్టే అవకాశం ఉంది.

పట్టణాల అభివృద్ధికి 14వ పైనాన్స్‌ కమిషన్‌లో రూ.87వేల కోట్లను కేటాయించారు. ఈ మొత్తం 2016-20 మధ్యలో వినియోగించారు. 2020-2021 సంవత్సరానికి మాత్రం మధ్యంతర నివేదికను విడుదల చేశారు. భారత్‌లో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఈ నేపథ్యంలో ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, పారదర్శకత తగినంత ఉండాలి. అప్పుడే ప్రైవేటు పెట్టుబడి దారులు పురపాలక సంఘాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారు. అవసరమైతే బాండ్లు కూడా జారీ చేయవచ్చు.

స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిని కరోనావైరస్‌ చిన్నాభిన్నం చేసింది. దీంతోపాటు ఈ సమయంలో పన్ను వసూళ్లు పెంచితే పరిస్థితి మరింత దిగజారవచ్చని పురపాలక సంఘాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ప్రమాణాలను పాటించిన పట్టణాలకు నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో సామాజిక మౌలిక సదుపాయాలు, గాలి నాణ్యత, ఘన చెత్త నిర్వహణ వంటి అంశాలను పరిశీలించనుంది. గతంలో విడుదల చేసిన మధ్యంతర నివేదికను పరిశీలిస్తే మాత్రం ఈ సారి 15వ ఆర్థిక సంఘంలో పట్టణ ప్రాంతాలకు భారీగా నిధులను సమకూర్చే అవకాశం ఉంది.

భారత్‌లో దాదాపు 3,700 పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు ఉన్నాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకొనేలా  ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తుంది. కానీ, ప్రైవేటు పెట్టుబడి దారులు మున్సిపల్‌ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ముందుకొచ్చి నిధులను కేటాయిస్తే.. ప్రైవేటు పెట్టుబడిదారుల్లో కూడా ఆత్మవిశ్వాసం వస్తుంది. కొత్త ఆర్థిక సంఘం పట్టణ పరిపాలనలో సంస్కరణలను  ప్రవేశపెట్టే అంశాలను పరిశీలిస్తోంది. వీటిల్లో సమాచార ఆధారిత సంస్కరణలు కూడా ఉన్నాయి. ఏటా ఆడిట్‌ నివేదికలను పబ్లిష్‌ చేయడం, ఆస్థి పన్నుకు సంబంధించిన కీలక రేట్లను ప్రకటించడం, వివిధ విభాగాల్లో ప్రమాణాలను పాటించడం, జాతీయ పురపాలక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటివి వీటిలో ఉన్నాయి.

ఇవీ చదవండి

నీకు వాటా కావాలా..? సిద్ధంగా ఉండు..!

‘రియల్‌’అవసరాలు గుర్తించండి..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని