మ్యూచువ‌ల్ ఫండ్సులో భారీగా పెరిగిన పెట్టుబ‌డులు - mutual-fund-investments-increased-2020
close

Published : 01/01/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యూచువ‌ల్ ఫండ్సులో భారీగా పెరిగిన పెట్టుబ‌డులు

2020 సంవ‌త్స‌రంలో మ్యూచువ‌ల్ ఫండ్సు ప‌రిశ్ర‌మ భారీగానే పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింది. మ్యూచువ‌ల్‌ ఫండ్సులోకి పెట్టుబ‌డులు 2020 న‌వంబ‌ర్ చివ‌రి నాటికి 13% పెరిగి రూ. 30 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. ఈ పెట్టుబ‌డులు డిసెంబ‌ర్ 2019 నాటికి రూ. 26.54 ల‌క్ష‌ల కోట్లు. మ్యూచువ‌ల్ ఫండ్సులో పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలికంగానే కాకుండా ఆక‌స్మిక పొదుపు సాధ‌నంగా కూడా పెట్టుబ‌డులు ఎంచుకుంటున్నారు. స్టాక్ మార్కెట్స్ అసాధార‌ణంగా అధిక లాభాల‌తో కొన‌సాగుతున్న‌ట్లే.. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఆస్తులు ఈ ఏడాది రూ. 3.5 ల‌క్ష‌ల కోట్లు పెరిగాయి. కొత్త సంవ‌త్స‌రం ఈ మ్యూచువ‌ల్ ఫండ్సు ప‌రిశ్ర‌మ‌కు మ‌రింత‌ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

ఈ పండ్సులో పెట్టుబ‌డి పెట్టేవారి సంఖ్య 2020లో 65 ల‌క్ష‌ల‌కు పైగా పెరిగింద‌ని అంచ‌నా. అయితే 2019లో ఈ పెట్టుబ‌డిదారుల సంఖ్య 99 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంది. 2021వ సంవ‌త్స‌రంలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ కొన‌సాగ‌డం కూడా మ్యూచువ‌ల్ ఫండ్సులో పెట్టుబ‌డులు భారీగా పెర‌గ‌డానికి అవ‌కాశ‌ముంటుంద‌ని, 16% - 17% పెట్టుబ‌డులు పెరుగుద‌ల ఫండ్సులోకి ఉంటుంద‌ని మార్కెట్ల వ‌ర్గాల అంచ‌నా.

కోవిడ్ 19 సంబంధించి వ్యాక్సిన్ అభివృద్ధి చేయ‌డం, ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రించే విధానం, భార‌త‌దేశానికి స్థూల ఆర్ధిక దృక్ప‌థం, అన్నీ రాబోయే సంవ‌త్స‌రంలో అన్ని మార్కెట్ల విజృంభ‌ణ‌కు మార్గ‌నిర్ధేశం చేస్తాయి. అంతేకాకుండా జీవ‌న ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తే ప్ర‌జ‌లు ఆదా, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే కోవిడ్‌-19 ఆక‌స్మిక పొదుపులు, పెట్టుబ‌డులు కీల‌కం అని ఒక ముఖ్య‌మైన పాఠం నేర్పింది.

అద‌నంగా, డిజిట‌లైజేష‌న్ ద్వారా పెట్టుబ‌డులు పెట్ట‌డం కూడా మ్యూచువ‌ల్ ఫండ్సు ప‌రిశ్ర‌మ యొక్క‌ ఆస్తుల‌ను పెంచ‌టంలో స‌హాయ‌ప‌డింది. 2020లో మ్యూచువ‌ల్ ఫండ్సుకి సిప్ (క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌) ద్వారా రూ. 8,055 కోట్లు పెట్టుబ‌డులు చేరాయి. 2019లో ఈ సిప్ పెట్టుబ‌డులు రూ. 8,218 కోట్లు, స్థిర‌ డిపాజిట్ల‌లో త‌క్కువ వ‌డ్డీ రేట్ల కార‌ణంగా పెట్టుబ‌డిదారులు డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు మొగ్గు చూపు తున్నార‌ని ముద్రా ఫోర్ట్‌ఫోలియో మేనేజ‌ర్స్ తెలిపింది.

ఈ సంవ‌త్స‌రంలో ఉత్త‌మ ప‌నితీరు క‌లిగిన అన్ని త‌ర‌గ‌తుల‌లో ఒక‌టిగా, పెట్టుబ‌డిదారుల‌లో ఇష్ట‌ప‌డే పెట్టుబ‌డి గ‌మ్య‌స్థానంగా బంగారం కూడా అవ‌త‌రించింది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్సు (ఈటిఎఫ్‌) 2020లో రూ. 6,200 కోట్ల చొప్పున వ‌చ్చాయి.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని