యమహా FZ 25 కొత్త ఎడిషన్‌@ ₹1.36 లక్షలు - new FZ 25 And Glamour extension
close

Updated : 21/07/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యమహా FZ 25 కొత్త ఎడిషన్‌@ ₹1.36 లక్షలు

దిల్లీ: ఇండియా యమహా మోటార్‌ తమ ఎఫ్‌జెడ్‌ 25 మోడల్‌లో ‘మాన్‌స్టర్‌ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌’ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1,36,800 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఈ నెలాఖరుకు వీటిని భారతీయ వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొస్తామని యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ మోటోఫుమి శితారా వెల్లడించారు.  

హీరో గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ ధరల శ్రేణి రూ.78,900-83,500
గ్లామర్‌ శ్రేణి మోటార్‌సైకిళ్లలో ఎక్స్‌టెక్‌ ఎడిషన్‌ను హీరో మోటోకార్ప్‌ మంగళవారం విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్రమ్‌ వేరియంట్‌ రూ.78,900 కాగా, డిస్క్‌ వేరియంట్‌ రూ.83,500 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). గ్లామర్‌ ఎక్స్‌టెక్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్‌ ఛార్జర్, సైడ్‌-స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్, బ్యాంక్‌ యాంగిల్‌ సెన్సార్, లైట్‌-ఎమిటింగ్‌ డయోడ్‌ హెడ్‌ ల్యాంప్‌ తదితర సదుపాయాలుంటాయని కంపెనీ తెలిపింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని