హ్యాకింగ్‌కు గురైన న్యూజిలాండ్‌ కేంద్రబ్యాంక్‌ - new zealand central bank says one of its data systems hacked
close

Published : 10/01/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హ్యాకింగ్‌కు గురైన న్యూజిలాండ్‌ కేంద్రబ్యాంక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌లో కొన్ని డేటా సిస్టమ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీనికి పాల్పడిన హ్యాకర్లను ఇంకా గుర్తించలేదు. కానీ, వారి చేతిలో పడ్డ సమాచారంలో కీలకమైన వాణిజ్య, వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. బ్యాంకులో కొన్ని కీలకమైన ఫైల్స్‌ సమాచారాన్ని పంచుకోవడానికి, భద్రపర్చడానికి ఒక థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ను వినియోగిస్తారు. హ్యాకర్లు దీనిని ఆధీనంలోకి తీసుకొని డేటా సిస్టమ్స్‌లోకి చొరబడ్డారు. ఈ విషయాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌ ఒక ప్రకటనలో వెల్లడిచింది. ‘‘బ్యాంక్‌ ఆ దాడిని ఆపగలిగింది..  కీలక వ్యవస్థల పనితీరు దీని కారణంగా ప్రభావితం కాలేదు. మేము దేశీయ, అంతర్జాతీయ సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో కలిసి ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని గవర్నర్‌ అడ్రైన్‌ఓర్‌ తెలిపారు.

కచ్చితంగా ఎంత డేటా, ఎటువంటి డేటా సిస్టమ్స్‌ నుంచి చోరీ అయిందో బ్యాంక్‌ వర్గాలు ఒక పట్టాన చెప్పలేకపోతున్నాయి. వీటిల్లో వాణిజ్య, వ్యక్తిగత సమాచారాలు ఉండే అవకాశం ఉందని ఓర్‌ తెలిపారు. హ్యాకింగ్‌పై ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యే వరకు సిస్టమ్స్‌ ఆఫ్‌లైన్‌లో ఉంచారు. ఏ సిస్టమ్‌ యూజర్స్‌ డేటాను దొంగిలించారో వారితో కలిసి పనిచేస్తున్నట్లు బ్యాంక్‌ వివరణ ఇచ్చింది. ఈ హ్యాకింగ్‌ పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చని సమాచారం.  

ఇవీ చదవండి

డొనాల్డ్‌ ట్రంప్‌ నెత్తిన కత్తి

నీటిలో తేలియాడుతున్న శరీర భాగాలు.. శకలాలు!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని