ఈపీఎఫ్ ఖాతా - ఆధార్ వెరిఫికేష‌న్ పూర్తిచేశారా? - EPFO has made Aadhaar seeding mandatory for all EPF accounts
close

Updated : 01/06/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈపీఎఫ్ ఖాతా - ఆధార్ వెరిఫికేష‌న్ పూర్తిచేశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. అన్ని ఈపీఎఫ్ఓ ఖాతాల‌కు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాల‌ని సంస్థల‌కు సందేశాల‌ను పంపించింది. ఈ మార్పులు నేటి (జూన్‌ 1, 2021) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించ‌ని ఖాతాల‌కు ఈసీఆర్ దాఖ‌లు చేయ‌లేరు కాబ‌ట్టి సంస్థ కాంట్రీబ్యూష‌న్ నిలిచిపోతుందని తెలిపింది. అందువ‌ల్ల‌ త‌ప్ప‌నిస‌రిగా ఆధార్‌ను అనుసంధానించాల‌ని కోరింది. ఆధార్ వైరిఫికేష‌న్ పూర్తైన అన్ని ఈపీఎఫ్ ఖాతాల‌కు యూఏఎన్ను పొందాల‌ని ఈపీఎఫ్ఓ.. సంస్థ య‌జ‌మానులను ఆదేశించింది. కాబ‌ట్టి ఈపీఎఫ్ ఖాతాదారులు, ఈపీఎఫ్ఓ జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఆధార్‌ను అనుసంధానించేంద‌కు కావ‌ల‌సిన ప‌త్రాల‌ను సంస్థ‌ల‌కు ఇవ్వండి.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ సీడింగ్‌ ఇలా..
* ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్‌ను తెరిచి, ఎడ‌మ వైపు ఉన్న ఇకేవైసి ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.
* ఇక్క‌డ యూఏఎన్‌, రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్ల‌ను ఎంట‌ర్ చేయాలి. 
* జ‌న‌రేట్ 'ఓటీపీ' ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌రుకు వ‌చ్చిన 'ఓటీపీ'ని ఎంట‌ర్ చేసి, జండ‌ర్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
ఇక్క‌డ ఆధార్ నంబ‌రును ఎంట‌ర్ చేసి 'ఆధార్ వెరిఫికేష‌న్' విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.
ప్ర‌స్తుతం ఉప‌యయోగిస్తున్న 'మొబైల్ లేదా ఇ-మెయిల్' ద్వారా వెరిఫికేష‌న్ పూర్తిచేయొచ్చు.
* వెరిఫికేష‌న్ కోసం మ‌రోసారి 'ఓటీపీ' వ‌స్తుంది.
'ఓటీపీ'ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి.
దీంతో ఈపీఎఫ్‌, యూఏఎన్ ఆధార్‌ అనుసంధాన ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని