ఇంటి అద్దె మినహాయింపును ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే.. - Employees-can-claim-deduction-against-house-rent-paid
close

Updated : 14/07/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి అద్దె మినహాయింపును ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..

ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)  ఉద్యోగుల వచ్చే వేతనంలో ఒక భాగం. కొన్ని చిన్న, మధ్య తరహా కంపెనీలు ఉద్యోగులకు పెద్ద  మొత్తాన్ని ఒకేసారి ఇస్తాయి.  అద్దె ఇంటిలో నివ‌సిస్తున్న ఉద్యోగులు ఇంటి అద్దె మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి హెచ్ఆర్ఏ అనేది వేతనంలో భాగంగా ఉండాలి. ఏదేమైనా, ఆదాయపు పన్ను చట్టం 1961  ప్ర‌కారం..  హెచ్ఆర్ఏ వారి వేతనంలో భాగం కాకపోయినా..  ఉద్యోగులు చెల్లించిన ఇంటి అద్దెకు మినహాయింపు క్లెయిమ్ చేసుకునే స‌దుపాయం ఉంది. అలాంటి ఉద్యోగులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 జిజి కింద.. చెల్లించిన ఇంటి అద్దెపై మినహాయింపు పొందవచ్చు. స్వయం ఉపాధి ఉన్నవారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. సెక్షన్ 80 జిజి కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయగల అవకాశాలపై ఓ లుక్కేద్దాం..

ప‌రిమితులు..

ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్షన్ 80 జిజి కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి, మీరు ఆ ఆర్థిక సంవత్సరంలో  హెచ్‌ఆర్‌ఏ పొందకూడదు. పన్ను చెల్లింపుదారునికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు లేదా సెక్షన్ 80 జిజి కింద చెల్లించిన అద్దెకు తగ్గింపును పొందే స‌దుపాయం ఉంది.
సెక్షన్ 80 జిజి కింద తగ్గింపును క్లెయిమ్ చేసే వ్యక్తి  ఉంటున్న‌ నగరంలో సొంత‌ ఇంటిని కలిగి ఉండకూడదు. దాంతో పాటు జీవిత భాగస్వామి, మైనర్ చైల్డ్ లేదా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యుఎఫ్) పేరిట, కార్యాలయం ఉన్న నగరంలో  ఇల్లు కూడా ఉండకూడదు. మీరు పనిచేసే నగరంలో మీకు కుటుంబ స‌భ్యుల‌కు ఇల్లు ఉంటే,  ఈ తగ్గింపును క్లెయిమ్ చేయలేరు.
 ఏ ఇతర నగరంలోనైనా ఇంటిని కలిగి ఉన్నప్ప‌టికీ ఉద్యోగికి మినహాయింపు ఉంటుంది. కానీ అందులో ఉద్యోగి లేదా కుటుంబ స‌భ్యులు నివాసం ఉండ‌కూడ‌దు. అద్దెకు ఇవ్వాలి.  అయితే ఇది కేవ‌లం ఉద్యోగికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కుటుంబ స‌భ్యుల‌కు ఇత‌ర న‌గ‌రాల్లో వారి పేరుతో ఇల్లు ఉండొచ్చు.

త‌గ్గింపు క్లెయిమ్ చేసేందుకు  పన్ను చెల్లింపుదారుడు 10బీఏ ఫారమ్‌ను దాఖలు చేయాలి. ఇది అన్ని షరతులకు అనుగుణంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ట్లుగా ప‌రిగ‌ణిస్తారు.   కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారు ఈ తగ్గింపును క్లెయిమ్ చేయలేరు.
ఇది ఎలా లెక్కిస్తారు?
దీన్ని మినహాయింపు సూత్రం ఆధారంగా లెక్కించాలి. ఈ నిబంధన ప్రకారం తగ్గింపు మొత్తం ఈ మూడింటి కంటే తక్కువగా ఉండాలి: ఎ) మొత్తం ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ చెల్లించిన అద్దె, బి) మొత్తం ఆదాయంలో 25 శాతం, సి) గరిష్టంగా నెలకు రూ. 5,000.  సంవత్సరంలో అనుమతించబడిన గరిష్ట మినహాయింపు రూ. 60,000. పన్ను చెల్లింపుదారు  స్థూల ఆదాయం నుంచి అన్ని తగ్గింపులను క్లెయిమ్ చేసిన తరువాత లెక్కింపు ప్రయోజనం కోసం మొత్తం ఆదాయాన్ని పరిగణించాలి.
కాబట్టి, ఉదాహరణకు, ఒక‌ వ్యక్తి మొత్తం ఆదాయం సంవత్సరానికి రూ. 15 లక్షలు, 80సీ తో సహా ఇతర ఆదాయ ప‌న్ను చ‌ట్టాల‌ కింద‌ వ్యక్తి సుమారు రూ. 2 లక్షల తగ్గింపులను క్లెయిమ్ చేస్తుంటే, అప్పుడు రూ. 13 లక్షలు మొత్తం ఆదాయంగా పరిగణించబడుతుంది. కాబట్టి, వ్యక్తి నెలకు, రూ. 12,000 ( రూ. 240,000 వార్షిక అద్దె) అద్దె చెల్లిస్తుంటే, ఆ వ్యక్తి ఈ మూడింటిలో కనీసం ఒక‌టి క్లెయిమ్ చేయగలడు: ఎ) రూ. 110,000 ( రూ.13 ల‌క్ష‌ల్లో 10 శాతం రూ. 2,40,000), బి) రూ. 60,000,  సి) రూ. 325,000. ఇక్క‌డ‌ సెక్షన్ 80 జిజి కింద వ్యక్తి క్లెయిమ్ చేయగలిగేది మూడింటిలో త‌క్కువ‌గా ఉన్న రూ.60,000
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని