HDFC Life acquires Exide Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చేతికి ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌! - HDFC Life to acquire Exide Life
close

Updated : 03/09/2021 21:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HDFC Life acquires Exide Life: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చేతికి ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌!

ఒప్పంద విలువ రూ.6,687 కోట్లు

ముంబయి: ప్రముఖ బీమా సంస్థ ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.6,687 కోట్లు. దీంతో ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన 100 శాతం వాటాలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు వెళ్లనున్నాయి. ఒక్కో షేరుకు రూ.685 చొప్పున మొత్తం 8,70,22,222 షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ పరంకానున్నాయి. మరో రూ.762 కోట్లు నగదు రూపంలో చెల్లించనున్నారు. ఈ ఒప్పందానికి ఐఆర్‌డీఏఐ, సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ, సెబీ వంటి నియంత్రణా సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

భారత ఇన్సూరెన్స్ చరిత్రలో ఇదో కీలక మైలురాయని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. మరింత ఎక్కువ మందికి ఆర్థిక భద్రత కల్పించేందుకు తమకు అవకాశం దక్కిందన్నారు. ఎక్సైడ్‌ లైఫ్‌కు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా టైర్‌-2, టైర్‌-3 పట్టణాల్లో  మంచి పట్టుంది. ఓ ప్రముఖ ఆర్థిక సంస్థ అంచనాల ప్రకారం.. జూన్‌ 30, 2021 నాటికి ఎక్సైడ్‌ విలువ రూ.2,711 కోట్లుగా ఉంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని