పెట్టుబ‌డుల ల‌క్ష్యాల‌కు 50-30-20 రూల్! - How-50-30-20-rule-helps-to-meet-investment-goals
close

Updated : 13/05/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబ‌డుల ల‌క్ష్యాల‌కు 50-30-20 రూల్!

క్ర‌మ‌మైన‌ ఆదాయం ఉన్నప్పుడు, వ్య‌యం కూడా ప్ర‌ణాళికాబ‌ద్ధంగానే ఉండాలి.  పన్ను, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖర్చులను మూడు వర్గాలుగా విభజించవచ్చు -1. జీవించ‌డానికి అవ‌స‌ర‌మైన‌ ఖర్చులు, 2. పొదుపు 3. ముఖ్యమే కానీ జీవించేందుకు త‌ప్ప‌నిస‌రి కాదు.  ఈ మూడు ఖర్చుల ఆధారంగా, 50-30-20 నియ‌మం ప‌నిచేస్తుంది. ఒక వ్య‌క్తి ఆదాయంలో 50 శాతం అస‌ర‌మైన ఖ‌ర్చుల‌కు, 30 శాతం ముఖ్య‌మైన‌ప్ప‌టికీ, జీవించేందుకు అవ‌స‌రం కానీ ఖ‌ర్చుల‌కు 20 శాతం పొదుపును సూచిస్తుంది. ఈ 50-30-20 రూల్ అనుస‌రించే వ్య‌క్తి పెట్టుబ‌డి ల‌క్ష్యాల‌ను సుల‌భంగా చేరుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

సంపాదించే వ్య‌క్తి ఏ..అవ‌స‌రాల‌కు ఎంత పెట్టుబ‌డి పెట్టాలో నిర్ణ‌యించుకునేందుకు ఈ నియ‌మం స‌హాయ ప‌డుతుంద‌ని, యూఎస్‌, యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల‌లో ఈ నియ‌మం చాలా ప్ర‌సిద్ధి చెందింద‌ని, భార‌త్‌లో కూడా దీన్ని అమ‌లు చేస్తున్నారని సెబి రిజిస్ట‌ర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి తెలిపారు.

ఎలా స‌హాయ‌ప‌డుతుంది..

50 శాతం అవ‌స‌రాలకు..

ఈ నియమం ప్ర‌కారం 50 శాతం మ‌న అవ‌స‌రాల‌కు వినియోగించుకోవాలి. అవ‌స‌రాలంటే మ‌నం జీవించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఇళ్లు, తిండి, బ‌ట్ట‌లు మొద‌లైన‌వి. ఇంటిరుణానికి చెల్లించే ఈఎమ్ఐలు, వాహ‌న‌, బీమా, విద్య‌, ఆరోగ్య సంబంధిత ఖ‌ర్చులు ఇందులో వ‌స్తాయి.


30 శాతం కోరిక‌ల‌కు..

ఇవి జీవించేందుకు త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రాల కింద రావు. విహార‌యాత్ర‌లు, ఎంట‌ర్‌‌టైన్ మెంట్, సినిమాలు, ఆట‌లుపాట‌లు ఇవ‌న్నీ ఈ కేట‌గిరీలోకి వ‌స్తాయి. సాధార‌ణంగా చూసే టీవీ షోలు మాత్ర‌మేకాకుండా ప్రీమియం షోలు, కొత్త గ్యాడ్జెట్ లు, ఖ‌రీదైన కారు మొద‌లైన అంశాలు.


20 శాతం పొదుపు..

మీరు సంపాదించిన మొత్తంలో పొదుపు, పెట్టుబ‌డుల కోసం కేటాయించే మొత్తం. అత్య‌వ‌స‌ర‌నిధి, పొదుపుఖాతాలో డ‌బ్బు, మ్యూచువ‌ల్ ఫండ్లు మొద‌లైన‌వి. ముందుగా తీర్చేసే రుణాల‌ను కూడా పొదుపు లో భాగంగా చేసుకోవ‌చ్చు. స‌మయానుగుణంగా చెల్లించేవి అవ‌స‌రాల్లోకి వ‌స్తే ముందుగా రుణభారాన్ని త‌గ్గించుకునే ఉద్దేశంతో చెల్లించే వాటిని పొదుపుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కి..: ఒక వ్య‌క్తి నెల‌కు 40 వేలు నిక‌ర ఆదాయం పొందితే అందులో కుటుంబ ఖ‌ర్చులు, బీమా, వైద్యం, ఇంటి అద్దె, గృహ‌రుణం వాయిదా త‌దిత‌ర ఖ‌ర్చుల‌న్నీ 50 శాతం అంటే 20 వేలు లోపు ఉండేలా చూసుకోవాలి. అనంత‌రం ఇత‌ర అవ‌స‌రాల‌కు, కోరిక‌లకు 12 వేలు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. వీటిలో వాహ‌న, విహారయాత్ర‌లు మొద‌లైన ఇత‌ర‌ ఖ‌ర్చుల‌ను చేయ‌వ‌చ్చు. ఇంకా 20 శాతం పొదుపు అంటే 8 వేలు చేయ‌వ‌చ్చు. దీంతో మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు త‌దిత‌ర పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. 

చివ‌రిగా..: ఈ నియమం అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేం. వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌ణాళిక వేసుకోవాలి. వీలైతే ఆర్థికప్ర‌ణాళిక కోసం స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది. మీరు దీన్ని పాటించడానికి ప్రయత్నిస్తే మీ ఆర్ధిక జీవితం సజావుగా సాగుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని