ఎన్‌పీఎస్‌తో కొత్త ఆదాయ ప‌న్ను చ‌ట్టంలో కూడా ప‌న్ను మిన‌హాయింపు - NPS-scheme-beneficiaries-in-new-income-tax-regime
close

Published : 02/08/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌పీఎస్‌తో కొత్త ఆదాయ ప‌న్ను చ‌ట్టంలో కూడా ప‌న్ను మిన‌హాయింపు

కేంద్ర బ‌డ్జెట్ 2020లో కొత్త ప‌న్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత రెండింటిలో ఏదైనా ఒక ప‌న్ను వ్య‌వ‌స్థను ఎంచుకునే అవ‌కాశం ప‌న్ను చెల్లింపుదారుల‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే కొత్త ప‌న్ను విధానం ఎంచుకుంటే చాలావ‌ర‌కు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపులు కోల్పోతారు, కానీ ప‌న్ను త‌క్కువ‌గా ఉంటుంది. అదే పాత విధానంలో అయితే వివిద ప్ర‌యోజ‌నాలు, మిన‌హాయింపులు ఉంటాయి, కానీ ప‌న్నులు అధికంగా ఉంటాయి. అయితే అన్నింటిని ప‌క్క‌న పెడితే ఎన్‌పీఎస్‌లో మాత్రం చందాదారుల‌కు మరో అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఉంది.
 అదేంటంటే..కొత్త ప‌న్ను విధానం ఎంచుకున్న‌ప్ప‌టికీ చందాదారులు ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్ 80 CCD (2) కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే ఎన్‌పీఎస్ ఖాతాలో త‌మ సంస్థ చేసిన వాటాపై ఈ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంద‌ని గుర్తుంచుకోవాలి. 
 అయితే దీనిపై ఎంత ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుందంటే..మొత్త వార్షిక వేత‌నంలో గ‌రిష్ఠంగా 10 శాతం వ‌ర‌కు సెక్ష‌న్ 80 CCD (2) కింద క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. వార్షిక వేత‌నం అంటే బేసిక్, డీఏ క‌లిపితే వ‌చ్చే మొత్తం జీతం. 
దీంతో పాటు  కొత్త ఆదాయపు పన్ను విధానంలో, పన్ను చెల్లింపుదారుడు ఉపాదిలో భాగంగా చేసే రవాణాపై అందుకున్న రవాణా భత్యంపై ఆదాయ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు వీలుంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని