డెట్ ఫండ్ల‌పై మెరుగైన రాబ‌డి కోసం ఎస్‌డ‌బ్ల్యూపీ - SWP-is-more-tax-efficient-than -the-dividend-option
close

Published : 07/07/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డెట్ ఫండ్ల‌పై మెరుగైన రాబ‌డి కోసం ఎస్‌డ‌బ్ల్యూపీ

డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు ఆర్థిక స‌ల‌హాదారుల‌ను సాధార‌ణంగా అడిగే ప్ర‌శ్న‌, డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకోవాలా లేదా విత్‌డ్రా ఆప్ష‌న్ ఎంచుకోవాలా అని. దీనికి స‌లహాదారులు ఎక్కువ‌గా ఇచ్చే స‌మాదానం ఎస్‌డ‌బ్ల్యూపీ. ఎందుకంటే డివిడెండ్‌పై  ఎక్కువ ప‌న్ను ప‌డుతుంది. దీంతో  రాబ‌డి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.
చాలామంది డివిడెండ్‌పై ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని ఆ ఆప్ష‌న్ ఎంచుకొని న‌ష్ట‌పోతుంటారు. కానీ అస‌లు విష‌యం ఏంటంటే కంపెనీలు డివిడెండ్ ఇచ్చేముందు డివిడెండ్ డిస్ర్టిబ్యూష‌న్ ట్యాక్స్ (డీడీటీ)  మిన‌హాయించుకొని ఇస్తాయి. డివిడెండ్ కంటే ఎస్‌డ‌బ్ల్యూపీ ఎందుకు మేలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప‌న్ను ప్ర‌యోజ‌నాలు:
మీరు మీ డెట్ మ్యూచువల్ ఫండ్ నుండి డివిడెండ్లను సేకరించినప్పుడు, ఫండ్ హౌస్ మీ తరపున సెస్, సర్‌చార్జ్‌తో సహా 29.12% డిడిటిని చెల్లిస్తుంది. ఎస్‌డ‌బ్ల్యూపీ ద్వారా ఉపసంహరణపై మీరు చెల్లించే పన్ను చాలా తక్కువ. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి,  మీరు ఉపసంహరించుకునేదానిలో మొత్తం పెట్టుబ‌డుల‌తో పాటు, లాభాలు కూడా క‌లిపి ఉంటాయి. కానీ ప‌న్ను కేవ‌లం లాభాల‌పై మాత్ర‌మే ప‌డుతుంది. చాలా సంద‌ర్భాల్లో ప‌న్ను చెల్లించిన త‌ర్వాత కూడా ఎక్కువ రాబ‌డిని పొంద‌వ‌చ్చు.  
మీరు పెట్టుబడి పెట్టిన మూడేళ్ళలోపు డెట్ ఫండ్ నుంచి వైదొలిగితే, లాభాలు మీ ఆదాయానికి జోడించి మీకు వర్తించే శ్లాబు రేట్ల ఆధారంగా పన్ను విధిస్తారు. మూడు సంవత్సరాల పెట్టుబడి తర్వాత మీరు ఉపసంహరించుకుంటే, ఇండెక్సేష‌న్‌ తర్వాత 20 శాతం వద్ద పన్ను వ‌ర్తిస్తుంది. ఇండెక్సేషన్  కారణంగా 36 నెలల తర్వాత ఉపసంహరణలు జరిగితే పన్నులు గణనీయంగా తగ్గుతుందని గుర్తుంచుకోండి.
మీరు పన్ను ప‌రిదిలో ఉంటే, మీకు ఎటువంటి గణనీయమైన లాభాలు లేకపోతే, ఎస్‌డ‌బ్ల్యూపీ విషయంలో స్వల్పకాలిక మూలధన లాభాలపై ఎటువంటి పన్ను చెల్లించే అవ‌స‌రం ఉండ‌దు. అలాగే, మీరు నష్టపోతే, దానికి వ్యతిరేకంగా మీ లాభాలను సర్దుబాటు చేయడం ద్వారా మీరు పన్నులను ఆదా చేయవచ్చు. పన్ను నిబంధనలు పన్ను చెల్లింపుదారులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలకు వ్యతిరేకంగా స్వల్పకాలిక మూలధన నష్టాన్ని తగ్గించడానికి అనుమతిస్తాయి. దీర్ఘకాలిక మూలధన నష్టాన్ని దీర్ఘకాలిక లాభాలకు వ్యతిరేకంగా మాత్రమే సెట్ చేయవచ్చు,  ఎనిమిది సంవత్సరాల వ‌ర‌కు ఈ విధంగా స‌ర్దుబాటు చేయ‌వ‌చ్చు.

ఇత‌ర ప్ర‌యోజ‌నాలు:
అనుకూల‌త‌  ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌వారు, పెట్టుబ‌డుల నుంచి క్ర‌మంగా ఆదాయం కావాల‌నుకుంటున్నవారు ఈ ఆప్ష‌న్ ఎంచుకోవచ్చు. కొన్నిసార్లు ఇత‌రులు కూడా క్రమంగా కొంత ఆదాయం అవ‌స‌రం ఉంద‌నుకున్న‌వారు ఈ విత్‌డ్రా స‌దుపాయాన్ని ఉప‌యోగించెకోవ‌చ్చు. ఈ విషయంలో డివిడెండ్ కంటే విత్‌డ్రా ఆప్ష‌న్ మేలు చేస్తుంది. అవ‌స‌రాన్ని బట్టి విత్‌డ్రా ఆప్ష‌న్‌ను త‌గిన‌ట్లుగా అనుకూలంగా మార్చుకోవ‌చ్చు. డివిడెండ్‌ అనేది క‌చ్చితమైన స‌మ‌యంలో నిర్ధిష్ట‌మైన మొత్తం ఉండ‌దు.
  ఉప‌సంహ‌ర‌ణ‌:
విత్‌డ్రా ఆప్ష‌న్‌లో ఉప‌సంహ‌ర‌ణ‌లు ఫండ్ ప‌నితీరుపై ఆధార‌ప‌డి ఉండ‌దు. మ‌రోవైపు మ్యూచువ‌ల్ ఫండ్ డివిడెండ్ల‌ను లాభం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే మ‌దుప‌రుల‌కు అందిస్తాయి. అందుకే క్ర‌మంగా అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆదాయం పొందే అవ‌కాశం ఉండ‌దు. రెగ్యులర్‌గా డివిడెండ్ పంపిణీ చేసే ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్ సంస్థ‌లు కూడా క‌చ్చితంగా డివిడెండ్‌ను ఇస్తాయ‌ని చెప్ప‌లేం. ఫండ్ ప‌నితీరు బాగా లేక‌పోతే, లాభాలు రాక‌పోతే డివిడెండ్ రాదు. డివిడెండ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది ఎంత అనేది ఫండ్ లాభాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. డివిడెండ్ ఇచ్చిన త‌ర్వాత ఫండ్ నిక‌ర ఆస్తి విలువ త‌గ్గుతుంద‌న్న విషయం గుర్తుంచుకోండి
 ఎగ్జిట్ లోడ్:
విత్‌డ్రా ఆప్ష‌న్‌లో ఉన్న ఏకైక ప్ర‌తికూల‌త ఎగ్జిట్ లోడ్ అని చెప్ప‌వ‌చ్చు. అది డెట్ ఫండ్‌పై, పెట్టుబ‌డులు ఎంత‌కాలం కొన‌సాగించ‌ర‌నే దానిపై ఆధార‌ప‌డి ఉంటుంది. నిర్దిష్ఠ కాలం త‌ర్వాత ఉప‌సంహ‌రించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండ‌దు. స్వ‌ల్ప కాలిక ఫండ్లు..లిక్విడ్ ఫండ్లు లేదా అల్ర్టా షార్ట్ ఫండ్ల విష‌యంలో కొన్ని నెల‌ల త‌ర్వాత ఉప‌సంహ‌రించుకుంటే ఫండ్ సంస్థ‌లు సాధార‌ణంగా ఎగ్జిట్ లోడ్ విధించ‌దు. పెట్టుబ‌డుల స‌మ‌యంలో ఎగ్జిట్ లోడ్ లేని ట్రాక్ రికార్డు ఉన్న స్కీమ్‌ను కూడా  ఎంచుకోవ‌చ్చు.
చివ‌ర‌గా:
డెట్ ఫండ్ల నుంచి క్ర‌మంగా విత్‌డ్రా చేసుకుంటే పెట్టుబ‌డుదారుల‌కు ప‌న్ను చెల్లింపుల త‌ర్వాత ఎక్కువ రాబ‌డి పొంద‌డ‌మే కాకుండా అస‌రానికి న‌గ‌దు పొంద‌వ‌చ్చు. కానీ డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకుంటే ఎంత డివిడెండ్ వ‌స్తుందో ముందుగానే ఊహించ‌లేము. అంతేకాకుండా డివిడెండ్‌పై ట్యాక్స్ కూడా ప‌డుతుంది. ఒక‌వేళ ఇప్ప‌టికే డివిడెంట్ ఆప్ష‌న్ ఎంచుకున్న‌ట్ల‌యితే ఇప్ప‌టికైనా ఎస్‌డ‌బ్ల్యూపీ ఆప్ష‌న్‌కు మార‌డం మంచిది.
ట్యాక్స్ విష‌యంలో డివిడెంట్ కంటే ఎస్‌డ్ల్యూపీ ఎందుకు స‌రైన‌దో తెలుసుకుందాం
డెట్ ఫండ్ల‌లో మొద‌ట ల‌క్ష రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టారనుకోండి. ఆ స‌మ‌యంలో నిక‌ర ఆస్తి విలువ (ఎన్ఏవి) రూ.100 గా ఉంది. ప్ర‌తీ త్రైమాసికానికి 7 శాతం పెరుగుతుంది. ఆ పెరిగిన ఏడు శాతాన్ని సిస్ట‌మేటిక్ విత్‌డ్రా ఆప్ష‌న్ ద్వారా పొంద‌వ‌చ్చు లేదా డివిడెండ్ రూపంలో తీసుకోవ‌చ్చు.
  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని