ఎంప్లాయిస్ స్టాక్ ఆప్ష‌న్స్ అంటే ఏమిటి? ప‌న్ను ఎలా వ‌ర్తిస్తుంది? - Taxes-on-ESOP
close

Published : 31/07/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంప్లాయిస్ స్టాక్ ఆప్ష‌న్స్ అంటే ఏమిటి? ప‌న్ను ఎలా వ‌ర్తిస్తుంది?

కోవిడ్ 19 మహమ్మారి కారణంగా వేతన కోతలకు బదులుగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్  ఇచ్చాయి.  కంపెనీ షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఒక సంస్థ ఉద్యోగులకు అందించే ఎంపిక ఈ స్టాక్ ఆప్ష‌న్స్. లాక్-ఇన్ వ్యవధి తర్వాత ఉద్యోగులు స్టాక్స్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. స్టార్టప్‌లతో ఈఎస్ఓపీలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వీటిపై రెండుసార్లు పన్ను వ‌ర్తిస్తుంది.

ఈఎస్ఓపీల‌కు రెండుసార్లు పన్ను విధిస్తారు - మొదట స్టాక్‌ను  ఎంపికను వినియోగించే సమయంలో, రెండోసారి  కేటాయించిన వాటాలను విక్రయించే సమయంలో ప‌న్ను లెక్కిస్తారు. 

వాటాల కేటాయింపు సమయంలో ESOP లకు  ప‌న్ను ఎలా విధిస్తారు?

ఆప్షన్‌ను ఉపయోగించిన తేదీ నాటికి వాటాల సరసమైన మార్కెట్ విలువ, ఆప్షన్‌ను వినియోగించ‌డానికి చెల్లించిన మొత్తం మధ్య వ్యత్యాసం ఉద్యోగి పన్ను పరిధిలోకి వస్తుంది. పన్ను చెల్లించదగిన విలువను 'పెర్క్విసైట్ (perquisite) అంటారు.

షేర్ల‌ను, వాటాలను విక్రయించే సమయంలో ESOP లకు  ప‌న్ను ఎలా విధిస్తారు?

స్టాక్ తీసుకున్న‌ తేదీ నాటికి అమ్మకపు విలువ, సరసమైన మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసం మూలధన లాభాలుగా ప‌రిగ‌ణించి పన్ను విధిస్తారు.

జాబితాలోని షేర్లు 
* 12 నెలల కన్నా తక్కువ కాలం మీ వ‌ద్ద ఉండి అవి జాబితాలోని షేర్లు అయితే వాటిపై పొందిన లాభాల‌ను స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న లాభాలుగా ప‌రిగ‌ణిస్తారు. వీటిపై 15 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

*12 నెలల వ్యవధి పూర్తయిన తర్వాత ESOP లను విక్రయిస్తే, జాబితాలోని షేర్ల‌పై  లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.  లక్ష రూపాయ‌ల‌ పైన ఉన్న లాభాలకు 10శాతం పన్ను ఉంటుంది, ల‌క్ష రూపాయ‌ల లోపు ఉంటే ఎటువంటి ప‌న్ను ఉండ‌దు.

లిస్ట్ కాని షేర్లు:
జాబితాతె  లేని షేర్లు 24 నెలలకు పైగా ఉంటే వాటిపై పొందిన‌ లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఇండెక్సేష‌న్‌తో క‌లిపి 20 శాతం పన్ను వర్తిస్తుంది. షేర్లు వ్యవధి 24 నెలల కన్నా తక్కువ ఉంటే, లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తాయి. ఉద్యోగికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను విధిస్తారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని