50/30/20 రూల్ గురించి తెలుసా?  - This-thumb-rule-can-help-you-put-your-finances-in-order
close

Updated : 29/07/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

50/30/20 రూల్ గురించి తెలుసా? 

మ‌నం చేసే ఖ‌ర్చుల‌కు సంబంధించి బ‌డ్జెట్ వేసుకుంటే ఎంత ఖ‌ర్చ‌వుతుంది… ఎంత పొదుపు చేస్తున్నాం… త‌దిత‌ర వివ‌రాల‌న్నీ తెలుసుకోవ‌చ్చు. ప్ర‌తీ నెలా ఇంటి ఖ‌ర్చులు ఎంత? ప‌ద‌వీవిర‌మ‌ణ నిధికి ఎంత వెన‌కేస్తున్నాం, అత్య‌వ‌స‌ర‌నిధి కోసం ఎంత పొదుపు చేస్తున్నాం అనేది లెక్క వేసుకోవాలి. 50/30/20 కుటుంబ బ‌డ్జెట్ నియ‌మం. ఈ నియమం ప్ర‌కారం ప‌న్ను చెల్లించాక మిగిలే ఆదాయాన్ని నిక‌ర ఆదాయంగా ప‌రిగ‌ణించి ఆ మొత్తా‌న్ని మూడు భాగాలుగా విభ‌జించి ప్ర‌ణాళిక వేసుకోవాలి.

50 శాతం అవ‌స‌రాలకు

ఈ నియమం ప్ర‌కారం 50 శాతం మ‌న అవ‌స‌రాల‌కు వినియోగించుకోవాలి. అవ‌స‌రాలంటే మ‌నం జీవించేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఇళ్లు, తిండి, బ‌ట్ట‌లు మొద‌లైన‌వి. ఇంటిరుణానికి చెల్లించే ఈఎమ్ఐలు, వాహ‌న‌, బీమా, విద్య‌, ఆరోగ్య సంబంధిత ఖ‌ర్చులు ఇందులో వ‌స్తాయి.

30 శాతం కోరిక‌ల‌కు

ఇవి జీవించేందుకు త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రాల కింద రావు. విహార‌యాత్ర‌లు, ఎంట‌ర్‌‌టైన్ మెంట్, సినిమాలు, ఆట‌లుపాట‌లు ఇవ‌న్నీ ఈ కేట‌గిరీలోకి వ‌స్తాయి. సాధార‌ణంగా చూసే టీవీ షోలు మాత్ర‌మేకాకుండా ప్రీమియం షోలు, కొత్త గ్యాడ్జెట్ లు, ఖ‌రీదైన కారు మొద‌లైన అంశాలు.

20 శాతం పొదుపు

మీరు సంపాదించిన మొత్తంలో పొదుపు, పెట్టుబ‌డుల కోసం కేటాయించే మొత్తం. అత్య‌వ‌స‌ర‌నిధి, పొదుపుఖాతాలో డ‌బ్బు, మ్యూచువ‌ల్ ఫండ్లు మొద‌లైన‌వి. ముందుగా తీర్చేసే రుణాల‌ను కూడా పొదుపు లో భాగంగా చేసుకోవ‌చ్చు. స‌మయానుగుణంగా చెల్లించేవి అవ‌స‌రాల్లోకి వ‌స్తే ముందుగా రుణభారాన్ని త‌గ్గించుకునే ఉద్దేశంతో చెల్లించే వాటిని పొదుపుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.

ఒక వ్య‌క్తి నెల‌కు 40 వేలు నిక‌ర ఆదాయం పొందితే అందులో కుటుంబ ఖ‌ర్చులు, బీమా, వైద్యం, ఇంటి అద్దె, గృహ‌రుణం వాయిదా త‌దిత‌ర ఖ‌ర్చుల‌న్నీ 50 శాతం అంటే 20 వేలు లోపు ఉండేలా చూసుకోవాలి. అనంత‌రం ఇత‌ర అవ‌స‌రాల‌కు, కోరిక‌లకు 12 వేలు ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు. వీటిలో వాహ‌న, విహారయాత్ర‌లు మొద‌లైన ఇత‌ర‌ ఖ‌ర్చుల‌ను చేయ‌వ‌చ్చు. ఇంకా 20 శాతం పొదుపు అంటే 8 వేలు చేయ‌వ‌చ్చు. దీంతో మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్లు త‌దిత‌ర పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. ఈ నియమం అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేం. వ్య‌క్తులు త‌మ అవ‌స‌రాల‌ను బ‌ట్టి ప్ర‌ణాళిక‌ను వేసుకోవాలి. వీలైతే ఆర్థికప్ర‌ణాళిక కోసం స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది. మీరు దీన్ని పాటించడానికి ప్రయత్నిస్తే మీ ఆర్ధిక జీవితం సజావుగా సాగుతుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని