నిర్మలమ్మ పద్దుపై ఎన్నారై వ్యాపారవేత్తల హర్షం - USAIC Welcomes Indian Budget
close

Published : 02/02/2021 16:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మలమ్మ పద్దుపై ఎన్నారై వ్యాపారవేత్తల హర్షం

వాషింగ్టన్‌: కేంద్రం సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అమెరికాలోని భారత సంతతి వ్యాపార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. వైద్యారోగ్య రంగానికి పెంచిన కేటాయింపులు భారత్‌ను ఆరోగ్య దేశంగా తీర్చిదిద్దేందుకు దోహదం చేయనున్నాయని అభిప్రాయపడ్డాయి. అలాగే మౌలిక వసతుల కల్పనకు చేయనున్న వ్యయం ఆర్థికవృద్ధికి అండగా నిలవనుందని ‘యూఎస్‌ఏ-ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (యూఎస్‌ఏఐసీ)’ అభిప్రాయపడింది. 

‘‘స్థూలంగా చూస్తే.. వైద్యారోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ఈ రంగంలో మౌలిక వసతుల కల్పనకు వ్యయంతో పాటు పరిశోధన విభాగానికి కూడా కేటాయింపులు చేశారు. వైద్యారోగ్య వ్యవస్థ మెరుగ్గా ఉంటే ఆ రంగంలో ఉత్పాదకత పెరుగుతుంది. అది వృద్ధికి దోహదం చేస్తుంది’’ అని యూఎస్‌ఏఐసీ అధ్యక్షుడు కరుణ్‌ రిషి తెలిపారు. కొవిడ్‌తో సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్థిక వృద్ధే లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేపట్టిన చర్యల్ని ఆయన కొనియాడారు. కొవిడ్‌తో తలెత్తిన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో కోశలోటు భారీగానే ఉండనుందన్న విషయాన్ని పారదర్శకంగా వెల్లడించారని తెలిపారు. అలాగే దాన్ని పూడ్చేందుకు హేతుబద్ధమైన చర్యలు చేపట్టి ఆదాయ-వ్యయాల మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నం చేశారని వివరించారు. రానున్న ఐదేళ్లలో ఈ కోశలోటును 4 శాతానికి తగ్గించాన్న లక్ష్యం శుభపరిణామమన్నారు. 

బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్యల పరిష్కారానికి ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీ (ఏఆర్‌సీ) ఏర్పాటును కరుణ్‌ రిషి సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. తొలి నుంచి సాంకేతిక వినియోగంపై దృష్టి సారించిన మోదీ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలో ఎంసీఏ 21 పోర్టల్‌ ఏర్పాటును ప్రతిపాదించడం మంచి పరిణామమన్నారు. డేటా అనలటిక్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రభుత్వ పాలనలో వినియోగించనుండడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...

20 ఏళ్లు దాటితే తుక్కే

బడ్జెట్‌లో ఎవరికేంటి?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని