ఆర్థిక ప్ర‌ణాళికతో చేకూరే ప్ర‌యోజ‌నాలు.. - benefits-of-financial-planning
close

Updated : 26/03/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక ప్ర‌ణాళికతో చేకూరే ప్ర‌యోజ‌నాలు..


* ఆర్థిక ప్రణాళిక భ‌విష్య‌త్తు సంతోషాల‌కు, విజయాల‌కు మార్గం వేస్తుంది. వ్యక్తులకు ఆర్థిక స్వేఛ్చతో పాటు, సరైన నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశమిస్తుంది.  కుటుంబసభ్యుల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయన్న భరోసా వారికి కలుగుతుంది.

* భవిష్యత్తు లక్ష్యాలను అర్థంచేసుకుని, దేనికి ఎంత వ‌ర‌కు ప్రాధ్యాన్య‌త ఇవ్వాలో తెలుసుకునేందుకు ఆర్థిక ప్రణాళిక ఉపయోగపడుతుంది.

* అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు, వాటిని ఆర్థికపరంగా ఎదుర్కోగలం అనే ధైర్యాన్ని ఇస్తుంది. అత్యవసర సమయాల్లో మనల్ని, మన కుటుంబాన్ని ఆర్థిక ప్రణాళిక రక్షిస్తుంది.

* భవిష్యత్తు అవసరాలకు ఎంత అవసరమవుతుంది, లక్ష్యాన్ని సాధించేంద‌కు ఎంత సమయం  ఉంది, త‌దిత‌ర విషయాల‌ను  అంచనా వేయవచ్చు. ఆపద సమయంలో నిరాశకు గురికాకుండా ఉండొచ్చు.

* నష్టాన్ని తట్టుకోగల శక్తిని బట్టి ఆర్థిక ఉత్పత్తులు, సేవలను గుర్తించి సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక ప్రణాళిక కీలక పాత్ర పోషిస్తుంది.

* పొదుపు అలవాటును పెంపొందించుకునేందుకు, సంపద సృష్టించుకునేందుకు ఆర్థిక ప్రణాళిక తోడ్పడుతుంది.

* సరైన పదవీ విరమణ ప్రణాళికను రూపొందించుకునేందుకు సహకరిస్తుంది.

* పన్నులు చెల్లించేందుకు, తగ్గించుకునేందుకు ఆర్థిక ప్రణాళిక ఉపయోగపడుతుంది.

మంచి ప్రణాళిక రూపొందించుకునేందుకు విజయాల బాటను సుస్పష్టంగా చూడగలగాలి. మన కలల మార్గం చేరేందుకు ఆర్థిక బాటలను ఇప్పటినుంచే వేసుకుందాం.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని