సీనియర్ సిటిజన్లకు 'బకెట్ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీ' ఎలా సహాయపడుతుంది? - bucket-portfolio-strategy-for-senior-citizens
close

Updated : 21/04/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియర్ సిటిజన్లకు 'బకెట్ పోర్ట్‌ఫోలియో స్ట్రాటజీ' ఎలా సహాయపడుతుంది?

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లు త‌గ్గ‌డం, చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో వ్య‌త్యాసం కారణంగా, సీనియర్ సిటిజన్లు వారి సాంప్రదాయ పెట్టుబడి ఎంపికల నుంచి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీనియ‌ర్ సిటిజ‌న్లు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి అత్యవసర నిధి, సాధారణ ఆదాయం, బ్యాలెన్స్ ఆదాయం, పెట్టుబడి ఎంపికలను కలిగి ఉన్న 'బకెట్ పోర్ట్‌ఫోలియో వ్యూహాన్ని' అనుసరించాల్సిన అవ‌స‌రం ఉంది. 

పదవీ విరమణానంతర ఆర్థిక అవసరాలను తీర్చడానికి బకెట్ పోర్ట్‌ఫోలియో వ్యూహం సీనియర్ సిటిజన్‌కు సహాయపడుతుంది. ఇది అత్యవసర నిధి, సాధారణ ఆదాయం, సమతుల్య ఆదాయం, పదవీ విరమణ కోసం ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి నిధిగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. అత్యవసర నిధి కోసం,  పోర్ట్‌ఫోలియోలో ద్రవ్యత అవసరం, సీనియర్ సిటిజన్ల విషయంలో ఇది చాలా ముఖ్యం, కాబట్టి బ్యాంక్ ఎఫ్‌డీలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. సాధారణ ఆదాయ ప్రయోజనం కోసం, ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎమ్‌వీవీవై), పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకం మొదలైనవి సిఫార్సు చేస్తున్నారు. అయితే, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, దీర్ఘకాలిక డెట్‌ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబ‌డులను ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.

3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం డెట్‌ మ్యూచువల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌గ‌టు ద్ర‌వ్యోల్బ‌ణ రేటు 5.5 శాతం నుంచి 6 శాతం అదిగ‌మించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డెట్ మ్యూచువల్ ఫండ్లలో, పెట్టుబడిదారుడు కనీసం 7 శాతం రాబడిని పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. డెట్‌ మ్యూచువల్ ఫండ్లలో లభించే ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం ఎల్‌టీసీజీని డిస్కౌంట్ చేస్తే, ఆదాయ పన్ను చెల్లింపు త‌ర్వాత ఇది 6 శాతం ఉంటుంది.
కాబట్టి, సీనియర్ సిటిజన్లు బకెట్ పోర్ట్‌ఫోలియో వ్యూహాన్ని అనుసరించడానికి, అన్ని రకాల పదవీ విరమణ అనంతర ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఆర్థికంగా సన్నద్ధమయ్యే సమయం ఇది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని