రూ.40-60 వేల శ్రేణిలో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు - electric two wheelers in the range of rs 40 to 60 thousand
close

Updated : 06/07/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.40-60 వేల శ్రేణిలో విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు

ముంబయి: రూ.39,999-60,000 శ్రేణిలో విద్యుత్తు ద్విచక్ర వాహనా (అవియాన్‌ఐక్యూ, క్లాస్‌ఐక్యూ )లను ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ సరఫరా సంస్థ ఒకాయా గ్రూప్‌ ఆవిష్కరించింది. దేశ వ్యాప్తంగా  ఇ-ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.ఇప్పటికే బద్దిలో (హిమాచల్‌ప్రదేశ్‌) తయారీ ప్లాంటు నెలకొల్పిన ఈ కంపెనీ హరియాణాలో మరో ప్లాంటును, నీమ్‌రానాలో (రాజస్థాన్‌) మరో 3 ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ‘ఈవీల కోసం ప్రత్యేకంగా ఒకటి భారత్‌లో, మరొకటి విదేశాల్లో రెండు ఆర్‌అండ్‌డీ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు ఒకాయా పవర్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ గుప్తా వెల్లడించారు. దిల్లీ, జయపురల్లో రెండు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ద్విచక్ర విద్యుత్‌ వాహన విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4 ఉత్పత్తులను తీసుకొస్తామని, 2025 నాటికి రహదారులపై కోటి ఇ-స్కూటర్లు తిరుగుతుండాలన్న ప్రభుత్వ కలను సాకారం చేసేందుకు మా వంతు సహకరిస్తామని పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని