ఒకే పాలసీలో.. నాలుగు రెట్ల రక్షణ..
close

Updated : 23/07/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే పాలసీలో.. నాలుగు రెట్ల రక్షణ..

వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీల ప్రాధాన్యం ఎంతో పెరిగింది. ఈ పాలసీల్లో కొత్త కొత్త ఆకర్షణలతో బీమా సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఈ కోవలోనే.. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వినూత్న పాలసీ ఆప్టిమా సెక్యూర్‌ను ఆవిష్కరించింది. దీన్ని తీసుకున్న మొదటి రోజు నుంచే పాలసీ విలువలో రెండు రెట్ల వరకూ రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత. తొలి ఏడాదిలో 50శాతం, ఆతర్వాత 100 శాతం పాలసీ విలువ పెరుగుతుంది. అంటే రెండేళ్లలో రెట్టింపు అవుతుందన్నమాట. క్లెయింలతో సంబంధం లేకుండా ఈ పెంపు వర్తిస్తుంది. ఒకసారి క్లెయిం చేసుకున్న తర్వాత.. తిరిగి పాలసీ మొత్తం భర్తీ అవుతుంది. ఈ రిస్టోర్‌ ప్రయోజనం కోసం ఎలాంటి అదనపు ప్రీమియాన్నీ చెల్లించక్కర్లేదు. చికిత్సలో భాగంగా ఉపయోగించే గ్లౌజులు, మాస్కులు, నెబ్యులైజర్‌ కిట్లు.. ఇలా అన్నింటికీ ఈ పాలసీ ఎలాంటి తగ్గింపులూ లేకుండా పరిహారం అందిస్తుంది. సెక్యూర్‌ బెనిఫిట్‌ ద్వారా ప్రాథమిక పాలసీకి రెండు రెట్ల వరకూ ఎలాంటి అదనపు ఖర్చూ లేకుండానే బీమా రక్షణ లభిస్తుంది. ప్లస్‌ బెనిఫిట్‌లో ప్రాథమిక పాలసీ రూ.10లక్షలకు తీసుకుంటే.. తొలి ఏడాది రూ.15లక్షలకూ, రెండో ఏడాది నాటికి రూ.20లక్షలకూ పాలసీ పెరుగుతుంది. దీనికి ప్రాథమిక పాలసీ రూ.10లక్షలు కలిస్తే పాలసీ విలువ రూ.30లక్షలకు చేరుకుంటుంది. పాలసీదారుడు ఒకవేళ  ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.10లక్షలు ఖర్చయిందనుకుందాం.. అప్పుడు రీస్టోర్‌ బెనిఫిట్‌లో భాగంగా అది మళ్లీ రూ.30 లక్షలకు చేరుతుంది. అంటే.. మొత్తం రూ. 40 లక్షలు. ఇలా ప్రాథమిక పాలసీకి నాలుగు రెట్ల వరకూ రక్షణ కల్పిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పేర్కొంది. దీనికి అనుబంధంగా హెల్త్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌లో 51 రకాల తీవ్ర వ్యాధులకు రక్షణ ఉంటుంది. హెల్త్‌ హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో ఆసుపత్రిలో చేరినప్పుడు రోజుకు రూ.500, రూ.1,000 ఇలా గరిష్ఠంగా రూ.10,000 వరకూ  చెల్లిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.2కోట్ల వరకూ బీమాను తీసుకునే అవకాశం ఉంది. 65 ఏళ్లలోపు వారందరూ ఈ పాలసీల్లో చేరేందుకు అర్హులు.  వ్యక్తిగతంగానూ, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని తీసుకునేందుకు వీలుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని