దాపరికం లేదు: నిర్మల
close

Published : 02/02/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాపరికం లేదు: నిర్మల

దిల్లీ: తమ ప్రభుత్వం పూర్తి బహిరంగ, పారదర్శక బడ్జెట్‌ను తీసుకొచ్చిందని, ఎలాంటి దాపరికాలకు యత్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ  మైనస్‌ 7.7 శాతం వృద్ధి నమోదు చేయనున్న నేపథ్యంలో.. ఆర్థిక రంగం పునరుజ్జీవానికి మౌలిక వసతులపై భారీగా వెచ్చించడం, ఆరోగ్య సంరక్షణ రంగ అవసరాలను నెరవేర్చడం వంటి అంశాలపై బడ్జెట్‌ 2021-22లో దృష్టి పెట్టామని తెలిపారు. సోమవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌  ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వం వదులుకోలేదన్నారు. లోటు నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌ చక్కటి మార్గసూచీని చూపించిందని, 2025-26 నాటికి లోటును జీడీపీలో 4.5 శాతం కంటే తక్కువకు తెచ్చేందుకు ఉపకరిస్తుందని వెల్లడించారు.
రాహుల్‌ వ్యాఖ్యలపై మండిపాటు
కేంద్ర బడ్జెట్‌ ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. మోదీ సర్కారు దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసేస్తోందని రాహుల్‌ ఆరోపించారు. దీనికి స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మల ‘ఆయన 15 రోజులకోసారి ఇవే మాటలు చెబుతూ ఉంటారు. కేరళలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు ఒక పోర్టును అదే పెట్టుబడిదారులకు ఎలా అప్పగించారు?’ అని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని