రాష్ట్రపతీ జీ.. నమస్కార్‌
close

Published : 02/02/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రపతీ జీ.. నమస్కార్‌

సంప్రదాయం పాటించిన నిర్మల

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆది నుంచీ కొనసాగుతున్న సంప్రదాయం మేరకు ఆమె పార్లమెంటుకు వెళ్లేముందు రాష్ట్రపతి భవన్‌ సందర్శించారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు కేంద్ర మంత్రివర్గం ఉదయం 10.15కు సమావేశమైంది. మామూలుగా ఆర్థికమంత్రి వచ్చే ముందే బడ్జెట్‌ కాపీలు పార్లమెంటు ఆవరణకు చేరేవి. ఈ ఏడాది కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ మేరకు ఎలాంటి కాపీల ముద్రణ జరగలేదు.

మళ్లీ ‘బాహీ - ఖాతా’ వైపే మొగ్గు..

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ట్రేడ్‌మార్క్‌ ‘బాహీ - ఖాతా’ను అనుసరించారు. గతంలో ఆర్థిక మంత్రులు తెచ్చినట్టు బ్రీఫ్‌కేసు కాకుండా.. ఎర్రటి వస్త్రం చుట్టిన ఓ రిజిస్టరులో బడ్జెటు దస్తావేజులతో ఆమె పార్లమెంటుకు వచ్చారు. భారతదేశ తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెటు 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన ప్రత్యక్ష బడ్జెట్లలో తొమ్మిదవది. బడ్జెట్‌ సమర్పణకు బ్రీఫ్‌కేసుతో రావడం 18వ శతాబ్దం నుంచి ఉన్న బ్రిటిష్‌ సంప్రదాయం. బడ్జెట్‌ అనే పదమే ఫ్రెంచి భాషలోని ‘బగెట్‌’ (లెదర్‌ బ్రీఫ్‌కేసు) నుంచి వచ్చింది.
భారత తొలి ఆర్థికమంత్రి ఆర్‌.కె.షణ్ముఖం చెట్టి 1947లో మొదటి బడ్జెటు సమర్పణకు తోలు దస్త్రం లాంటిది తెచ్చారు. 1950లో కృష్ణమాచారి ఫైల్‌బ్యాగ్‌తో వచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ నల్లటి బ్రీఫ్‌కేసు వాడేవారు. మన్మోహన్‌సింగ్‌ నల్లటి బ్యాగు, ప్రణబ్‌ ముఖర్జీ ఎర్రటి బ్రీఫ్‌ కేసు వాడేవారు. పీయూష్‌ గోయల్‌ ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని