మూడేళ్లలో ఏడు
close

Published : 02/02/2021 04:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడేళ్లలో ఏడు

మెగా టెక్స్‌టైల్‌ పార్కులు

దిల్లీ: దేశీయ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చి ప్రపంచస్థాయిలో పోటీపడే వాతావరణం కల్పించేందుకు, ఉపాధి అవకాశాల మెరుగుకు పలు చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ పార్కుల్లో అత్యాధునిక సమీకృత వసతులు, రవాణా నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు ఉంటాయి. ‘‘మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్స్‌ (మిత్ర) భారతీయ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కీలకం. పెట్టుబడుల రాకకు, ఉపాధి కల్పనకు ఈ పార్కులు ఎంతగానో దోహదపడతాయి’’ అని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరాని ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని