వంటగ్యాస్‌ రాయితీ ఆవిరి
close

Published : 02/02/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వంటగ్యాస్‌ రాయితీ ఆవిరి

కిరోసిన్‌పై రాయితీ పోయింది. వంటగ్యాస్‌పైనా క్రమంగా తగ్గిపోతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.25వేల కోట్ల మేర నిధుల కోత పడటంతో.. ఈ భారం వినియోగదారుడే మోయాల్సి వస్తోంది. గతేడాది కిరోసిన్‌పై రూ.2,982 కోట్లు రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది కేటాయింపులే లేవు. వంటగ్యాస్‌పైనా గతేడాదితో పోలిస్తే రూ.22వేల కోట్లను తగ్గించారు.
సిలిండర్‌కు రూ.16 మాత్రమే
అయిదేళ్ల కిందట నగదు బదిలీ పథకం అమలు చేసిన సమయంలో ఒక్కో సిలిండర్‌పై రూ.300 పైగా తిరిగి వచ్చేది. ఈ సొమ్ము వినియోగదారు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. అక్కడి నుంచి సిలిండర్‌ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. వినియోగదారుడికి అందే రాయితీ.. క్రమంగా తగ్గింది. గతేడాది మార్చిలో రాయితీ సిలిండర్‌ ధర రూ.833కి పెరగ్గా.. రాయితీ రూ.254 వచ్చింది. మే నెలలో సిలిండర్‌ ధర రూ.613 ఉంటే.. వినియోగదారుడికి అందిన రాయితీ రూ.16.38 మాత్రమే. అక్కడి నుంచి డిసెంబరు వరకు ఇదే విధంగా జమ అవుతోంది.


ఇతర దేశాలకు రూ.7,100 కోట్లు

పొరుగు దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్‌  అమెరికా దేశాలకు రూ.7,100 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో భూటాన్‌కు రూ.3,004 కోట్లు కేటాయించారు. ఇరాన్‌లో చాబహార్‌ నౌకాశ్రయానికి రూ.100 కోట్లు ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని