బడుల బలోపేతం
close

Published : 02/02/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడుల బలోపేతం

దిల్లీ: దేశ వ్యాప్తంగా బడుల బలోపేతం, బోధనలో నాణ్యత పెంపొందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా వ్యాయామోపాధ్యాయులు(పీఈటీ), సంగీతం, కళలు, చిత్రలేఖనం తదితర ఉపాధ్యాయులను నియమించడంతోపాటు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా దేశంలోని 15,000 పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించనున్నట్టు పేర్కొంది. అవి దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన పాఠశాలలకు మెంటార్‌గా వ్యవహరిస్తాయి. బడ్జెట్‌లో విద్యకు సంబంధించిన కీలకాంశాలు...
దేశ వ్యాప్తంగా కొత్తగా 100 సైనిక పాఠశాలలు. వీటిని ఎన్‌జీవో సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తారు.
ఉన్నత విద్యలో విదేశీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూనే...వాటిలో బహుళ డిగ్రీలు, గిరాకీ ఉన్న కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు, వాటి పర్యవేక్షణకు ఓ వ్యవస్థ.
ఉన్నత విద్యకు రూ.38,350 కోట్లు.
దేశంలోని వివిధ నగరాల్లో కేంద్ర ఆధ్వర్యంలో నడిచే పరిశోధన కేంద్రాలు, విద్యాసంస్థలు, కళాశాలలన్నింటినీ ఒక గొడుకు కిందకు. జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఆర్‌ఎఫ్‌) కార్యకలాపాలకు ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు.
గిరిజన విద్యార్థుల కోసం ఆయా వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 750 ఏకలవ్య గురుకుల పాఠశాలలు.

విద్యా శాఖకు మొత్తం ఇచ్చింది 93,224.31 కోట్లు
పాఠశాల విద్య- 54,873.66 కోట్లు
కేంద్రీయ విద్యాలయాలు- 6,800 కోట్లు
నవోదయ విద్యాలయాలు- 3,800 కోట్లు
మధ్యాహ్న భోజన పథకం- 11,500 కోట్లు
ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా మార్చాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా 10 ప్రభుత్వ శ్రేష్ఠతర విద్యాసంస్థలను ఎంపిక చేసి, వాటికి రూ.1710 కోట్లు ఇచ్చింది.
కళాశాలలు, వర్సిటీల్లోని విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.రూ.207 కోట్లు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని