రహదారులిక... రయ్‌ రయ్‌
close

Published : 02/02/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రహదారులిక... రయ్‌ రయ్‌

రాయ్‌పూర్‌-విశాఖ కారిడార్‌కు నిధులు

దిల్లీ: హైవే కారిడార్లు, ఇతర రవాణా ప్రాజెక్టుల్ని వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటి నిర్మాణానికి గత ఏడాది రూ.91,823 కోట్లను కేటాయించగా తాజాగా ఆ నిధుల్ని రూ.1.01 లక్షల కోట్లకు పెంచింది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.1,18,101 కోట్లను ఇవ్వనుంది. ఇందులో రూ.1,08,230 కోట్లు మూలధనం. ఇప్పటిదాకా ఇదే అత్యంత ఎక్కువ అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఉత్తరాంధ్రల మీదుగా సాగే 464 కిలోమీటర్ల రాయ్‌పూర్‌-విశాఖపట్నం కారిడార్‌కు ఈ సంవత్సరం నిధులు కేటాయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పనులు ప్రారంభం అవుతాయి.
పట్టణ ప్రాంతాల్లో ప్రజారవాణాను మెరుగుపరిచేందుకు రూ.18,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రతిపాదించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 20,000 బస్సులను అందుబాటులోకి తెస్తారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అగ్రతాంబూలం
త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో అగ్రతాంబూలం లభించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కేరళ రాష్ట్రాల్లోని రహదారుల నిర్మాణం, అభివృద్ధికి రూ. 2.27 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
తమిళనాడులో రూ.1.03 లక్షల కోట్లతో 3,500 కిలోమీటర్లు.
కేరళలో రూ.65,000 కోట్లతో 1,100 కిలోమీటర్లు.
పశ్చిమబెంగాల్‌లో రూ.25,000 కోట్లతో రహదారుల పనులు.
అసోంలో రూ.34,000 కోట్లతో 1,300 కిలోమీటర్ల మేర పనులు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని