నచ్చిన సంస్థ నుంచి విద్యుత్తు
close

Published : 02/02/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నచ్చిన సంస్థ నుంచి విద్యుత్తు

దిల్లీ, ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో కునారిల్లుతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు నూతన జవసత్వాలు అందించడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ.3.05 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఓ నూతన పథకాన్ని ప్రతిపాదించారు. దీంతోపాటు వినియోగదారులు తమకు నచ్చిన సంస్థ (సర్వీస్‌ ప్రొవైడర్‌) లేదా డిస్కం నుంచి విద్యుత్తు కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలోనే ఓ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వినియోగదారులు అందరికీ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ఈ ప్రకటనలు వెలువడ్డాయి. విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా గతేడాది ప్రభుత్వం ప్రత్యేకంగా వినియోగదారుల నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని డిస్కంలు గుత్తాధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిమధ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా వినియోగదారుడికి ఎంపిక అవకాశం కల్పించాల్సిన అసవరం ఉంది. విద్యుత్తు పొందడం కోసం ఒకటి కంటే ఎక్కువ సరఫరా సంస్థల నుంచి వినియోగదారులు ఒకదానిని ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి ఓ విధానాన్ని అందుబాటులోకి తెస్తాం’’ అని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనివల్ల టెలికం రంగంలో మాదిరిగానే విద్యుత్తు రంగంలోనూ వినియోగదారులకు ఎంపిక సౌలభ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. హరిత విద్యుత్తు వనరుల నుంచి హైడ్రోజన్‌ తయారీ నిమిత్తం వచ్చే ఏడాది వచ్చే ఆర్థిక సంవత్సరంలో నేషనల్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ మిషన్‌ ప్రారంభించే ప్రతిపాదనను ఈ సందర్భంగా సీతారామన్‌ ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని