టాగోర్‌ ఆశావాదం.. తిరక్కురల్‌ రాజధర్మం
close

Published : 02/02/2021 04:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాగోర్‌ ఆశావాదం.. తిరక్కురల్‌ రాజధర్మం

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం నాటి తన బడ్జెట్‌ ప్రసంగంలో సందర్భానుసారంగా విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌, తమిళ ప్రాచీన మహాకావ్యం ‘తిరక్కురల్‌’ సూక్తులను ఉటంకించారు.
‘నమ్మకం ఓ పక్షిలాంటిది. ప్రాతఃకాలాన కమ్మిన చీకట్లు ఇంకా పూర్తిగా తొలగకముందే.. అది అరుణోదయ కాంతులను అనుభూతి చెంది పాటందుకొంటుంది.’ .. కొవిడ్‌-19పై పోరాటాన్ని గుర్తు చేసుకొంటూ రవీంద్రుడన్న ఈ మాటలను మంత్రి వల్లె వేశారు.
‘పాలకుడు సంపదను సృష్టించి.. సంరక్షించి.. పదుగురికీ ఉపయోగపడే మంచి పనులకు పంచిపెట్టాలి’ బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ప్రాచీన తమిళ మహాకావ్యం ‘తిరక్కురల్‌’లోని ఈ వాక్యాలను మంత్రి గుర్తు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని