బడ్జెట్‌పై ఎవరు ఏమన్నారు
close

Updated : 02/02/2021 06:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌పై ఎవరు ఏమన్నారు

పేదరికాన్ని పారదోలుతుందా?

దేశంలోని కోట్ల మంది పేదలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆకర్షణీయ వాగ్దానాలు, డొల్ల హామీలు వినీ వినీ అలసిపోయారు. వారి జీవితాలు ఇప్పటికీ బాధాకరంగానే ఉన్నాయి. ఈ బడ్జెట్‌ పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణ సమస్యలను తీర్చగలదా? ఈ ప్రాతిపదిక మీదే ప్రభుత్వ కార్యకలాపాలు, బడ్జెట్‌పై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. 

- మాయావతి, బీఎస్పీ అధ్యక్షురాలు

భారత్‌ను అమ్మడమే లక్ష్యం

భారత తొలి కాగిత రహిత బడ్జెట్‌ కాస్తా 100 శాతం ప్రణాళిక రహిత బడ్జెట్‌గా మిగిలింది. ఈ నకిలీ పద్దు లక్ష్యం భారత్‌ను తెగనమ్మడమే. సాధారణ ప్రజలు, రైతులను విస్మరించారు. ఇందులో మధ్యతరగతి వారికి దక్కింది శూన్యం. సెస్సులు పెంచడం అంటే రాష్ట్రాల ఆదాయాన్ని దోచుకోవడమే. ఇది సమాఖ్య వ్యవస్థపై మరో దోపిడీ.

- డెరెక్‌ ఓ బ్రియెన్‌, తృణమూల్‌ ఎంపీ

ధనవంతులకే లబ్ధి

ఈ బడ్జెట్‌ ప్రజల కోసమూ కాదు.. విపరీతంగా ప్రచారం చేసిన ‘జు’ ఆకారపు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసమూ కాదు. ధనవంతులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత బీదలుగా మారే ‘రీ’ ఆకారపు ఆర్థిక పురోగతి కోసమే.

- సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

10కి 9 మార్కులు ఇస్తాను

ఏటా నేను బడ్జెట్‌కు మార్కులు ఇవ్వడానికి దూరంగా ఉంటాను. అయితే తొలిసారిగా ఈ బడ్జెట్‌కు 10కి 9 మార్కులు ఇస్తాను. 10 మార్కులు కూడా ఇవ్వొచ్చు. కానీ అలా చేస్తే నన్ను రకరకాల పేర్లతో పిలుస్తూ విమర్శిస్తారు.

- హర్ష్‌ గోయెంకా, ప్రముఖ పారిశ్రామికవేత్త

పేదలకు ఒరిగేదేం లేదు

మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్పొరేట్‌ సంస్థల అనుకూల ఆర్థిక విధానాలకు కొనసాగింపుగానే ఈ బడ్జెట్‌ను రూపొందించారు. దీనివల్ల పేదలకు, అణగారిన వర్గాలకు ఒరిగేదేం లేదు.

- సీపీఐ

ప్రజా వ్యతిరేక పద్దు

ఇది ప్రజలను మోసం చేసే ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్‌. భాజపా ఇతరులకు జాతీయవాదం మీద ఉపన్యాసాలు ఇస్తుంది. కానీ వారే దేశాన్ని అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, బీమా సంస్థలు, రైల్వేలు, రేవులు.. ఇలా అన్నీ తెగనమ్ముతున్నారు.

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం

కార్పొరేట్‌ శక్తులకు లబ్ధి

భాజపా వేసే ప్రతి అడుగులోనూ సాధారణ ప్రజల నుంచి అన్నీ దోచుకుని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే దురుద్దేశం ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్‌ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదే. ఇది సామాన్యులు, రైతుల సమస్యలను మరింత పెంచుతుంది.

- ఎస్పీ

అసలు ఉద్దేశాన్ని దాచారు

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని దాచిపెడుతూ ఆర్థిక మంత్రి అందమైన పదాలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని నింపేశారు. నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి అవసరమైన దిశా నిర్దేశం బడ్జెట్‌లో కనిపించలేదు.

- ఎన్‌సీపీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని