జీవిత బీమా ఉచితంగా ఇస్తున్నార‌ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..  - opting-for-a-fixed-deposit-with-free-life-insurance
close

Updated : 15/05/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవిత బీమా ఉచితంగా ఇస్తున్నార‌ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. 

కొన్ని బ్యాంకులు, త‌మ వ‌ద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే జీవిత బీమా ఉచితంగా ఇస్తామ‌ని చెబుతున్నాయి. ఈ ఆఫ‌ర్‌ల‌ను ఉప‌యోగించుకునేందుకు  మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌నుకుంటున్నారా? మ‌రి ఉచిత బీమా కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌ర‌మేనా?  తెలుసుకుందాం రండి. 

ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో ఉచితంగా ల‌భించే జీవిత బీమాకు కొన్ని ష‌ర‌తులు, ప‌రిమితులు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కి, డీసీబీ బ్యాంకు అందిస్తున్న సుర‌క్షా ఎఫ్‌డీని తీసుకుంటే, జీవిత బీమా పాల‌సీ కోసం ఈ బ్యాంక్ ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  బ్యాంకు అధికారిక‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివ‌రాల ప్ర‌కారం 18 నుంచి 54 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారికి మాత్ర‌మే సుర‌క్షా ఎఫ్‌డీ అందుబాటులో ఉంది. 55 సంవ‌త్సరాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు వారికి ఈ ఎఫ్‌డీ ఖాతాను తెరిచేందుకు అనుమ‌తి లేదు. 

ఎంత మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారో.. అంత మొత్తానికే జీవిత బీమా క‌వ‌ర్ చేస్తారు.  అంటే మీరు ఒక ల‌క్ష రూపాయిలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, రూ.1 ల‌క్ష‌కే జీవిత బీమా క‌వ‌రేజ్ ఉంటుంది. ఒక వేళ మీరు రూ. 50 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ మొత్తానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన‌ప్ప‌టికీ, రూ. 50 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌ని మాత్ర‌మే బ్యాంకు ఆఫ‌ర్ చేస్తుంది. 

మూడేళ్ల కాల‌వ్య‌వ‌ధి ఉన్న సుర‌క్షా ఎఫ్‌డీల‌పై 6.75 శాతం వ‌డ్డీ రేటును డీసీబీ బ్యాంక్ అందిస్తుంది. వ్య‌క్తి వ‌య‌సు, ఫిక్స్‌డ్ డిపాజిట్ కాల‌వ్య‌వ‌ధి వంటి వాటికి కొన్ని ప‌రిమితులు వ‌ర్తిస్తాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3 ల‌క్ష‌ల ఉచిత జీవిత బీమా క‌వ‌రేజ్‌ను అందిస్తుంది. బ్యాంకు అధికార‌క వెబ్‌సైట్ ప్రకారం, రూ.3 ల‌క్ష‌లు అంత‌కంటే ఎక్కువ మొత్తానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరిచిన ఖాతాదారుల‌కు ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితికి జీవిత బీమాను అందిస్తుంది. రెండేళ్లు అంత‌కంటే ఎక్కువ కాలానికి ఫిక్స‌డ్ డిపాజిట్ చేసుండాలి. 18 నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారైయుండాలి. ఐసీఐసీఐ ప్రొడ‌న్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్ భాగ‌స్వామ్యంతో బ్యాంకు గ్రూప్ క‌వ‌ర్‌ను ఆఫ‌ర్ చేస్తుంది. 

ముంద‌స్తు విత్‌డ్రాల‌కు ఉచిత జీవిత బీమా వ‌ర్తించ‌దు. ఉమ్మ‌డి ఖాతాల విష‌యంలో మొద‌టి డిపాజిట్ దారునికి మాత్ర‌మే రెండు బ్యాంకులు బీమాను వ‌ర్తింప‌చేస్తున్నాయి. 

గుర్తుంచుకోండి..
ఇలాంటి  ఉచిత జీవిత బీమాతో వ‌చ్చే ఫిక్స‌డ్ డిపాజిట్ల‌లో కొన్ని ష‌ర‌తులు, ప‌రిమితులు ఉంటాయి కాబ‌ట్టి ఉచిత బీమా కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డం మంచిది కాదు. జీవిత బీమా కోసం కాకుండా కేవ‌లం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను దృష్టిలో ఉంచికుని మాత్ర‌మే డిపాజిట్లు చేయాలి. 

అదేవిధంగా ఎఫ్‌డీ, మ్యూచువ‌ల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు వ‌చ్చే ఉచిత బీమాపై ఆధార‌ప‌డ‌కుండా, విడిగా జీవిత బీమా తీసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 15 రెట్లు ఎక్కువ‌గా క‌వ‌ర్ చేసే ట‌ర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయంది. దీనికి తోడుగా ఇటువంటి క‌వ‌ర్ల‌ను ఎంచుకోవ‌చ్చు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని