సంవత్సరంలో రూ. 17,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మిన‌హాయింపు - save-tax-on-interest-income-of-up-to-RS-17000-in-a-year
close

Published : 09/07/2021 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంవత్సరంలో రూ. 17,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మిన‌హాయింపు

మీరు మీ పన్ను రిటర్నుల‌ను దాఖలు చేసేట‌ప్పుడు, వడ్డీ ఆదాయంపై పన్ను ఆదా చేయడానికి ఈ తగ్గింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేయడం మర్చిపోవద్దు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టిటిఎ కింద పొదుపు బ్యాంకు ఖాతాలో సంపాదించిన వడ్డీపై రూ.10,000 వరకు మినహాయింపు పొందవచ్చని తెలిసిందే. ఇది వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు లేదా పోస్టాఫీసుతో పొదుపు ఖాతాలో సంపాదించిన వడ్డీ ఏదైనా కావొచ్చు. 

అయితే ఆర్థిక సంవత్సరంలో రూ. 3,500 వరకు పోస్టాఫీసు పొదుపు ఖాతాలో సంపాదించిన వడ్డీపై అదనపు మినహాయింపు పొందవచ్చని మీకు తెలుసా? ఉమ్మడి ఖాతా విషయంలో రూ. 7,000 వరకు వడ్డీ ఆదాయం పన్ను మినహాయింపు ల‌భిస్తుంది. కాబట్టి, మీరు మీ భాగ‌స్వామితో పోస్టాఫీసులో ఉమ్మడి పొదుపు ఖాతా తెరిచినట్లయితే, మీరిద్దరూ విడిగా రూ. 3,500 పన్ను మినహాయింపు పొందవచ్చు. కాబట్టి, మొత్తంగా మీరు పొదుపు బ్యాంకు ఖాతా నుండి రూ.10,000 వరకు, పోస్టాఫీసు పొదుపు ఉమ్మడి ఖాతా నుంచి, రూ. 7,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను ఆదా చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (15) కింద వస్తుంది. 
పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాల నుంచి వడ్డీ ఆదాయంపై, మీరు సెక్షన్ 80 టీటీఏ కింద రూ. 10,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు, దీంతోపాటు సెక్షన్ 10 (15) కింద రూ. 3,500 వరకు  పన్ను మినహాయింపు పొంద‌వ‌చ్చు. అయితే, ఒకేసారి ఈ రెండింటిని క్లెయిమ్ చేసేందుకు వీలుండ‌దు.
కానీ, మీకు పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా నుండి రూ. 10,000 వడ్డీ ఆదాయం ఉంటే, మీరు మినహాయింపు ఆదాయంలో, రూ. 3,500 ను క్లెయిమ్ చేయవచ్చు, మిగిలిన, రూ. 6,500 ను సెక్షన్ 80 టీటీఏ కింద మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు.
అలాగే, మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) లో వడ్డీ ఆదాయాన్ని, పన్ను మినహాయింపుగా లేదా పన్ను త‌గ్గింపుగా క్లెయిమ్ చేస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేస్తుంటే, మీ వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద చూపించవలసి ఉంటుంది. మీరు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేస్తుంటే, మినహాయింపు ఆదాయంలో భాగంగా దానిని చూపించవచ్చు.
అయితే, ఈ సంవత్సరం నుంచి, బ్యాంకులు, పోస్టాఫీసులు వ్యక్తులు సంపాదించిన వడ్డీ వివరాలను పన్ను శాఖకు పంపాల్సిన అవసరం ఉన్నందున ఈ సమాచారం మీ ఐటీఆర్‌ ఫారంలో ముందే ఉండే అవకాశం ఉంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని