యూపీఐ చెల్లింపులకు రుసుముల్లేవ్‌ - no charges on transaction through upi platforms
close

Published : 01/01/2021 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీఐ చెల్లింపులకు రుసుముల్లేవ్‌

అసత్య ప్రచారాల్ని నమ్మొద్దన్న ఎన్‌సీపీఐ

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు చేసే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ప్లాట్‌ఫాంలలో చెల్లింపులు ఉచితమేనని నేషనల్‌ పేమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) శుక్రవారం స్పష్టం చేసింది. జనవరి 1, 2021 నుంచి డిజిటల్‌ చెల్లిపులకు ఛార్జీలు వసూలు చేస్తారని వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని  తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం యూపీఐ నుంచి చేసే నగదు చెల్లింపులకు ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయడం లేదు. కరోనా కారణంగా 2020 సంవత్సరంలో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2008లో ప్రారంభమైన ఎన్‌సీపీఐ సంస్థ భారతదేశంలో రిటైల్‌ చెల్లింపులను నిర్వహిస్తోంది.

ఇవీ చదవండి..

ఐయూసీ రద్దుతో జియోపైనే ప్రభావం

కొవిషీల్డ్‌ టీకాకు గ్రీన్‌ సిగ్నల్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని