ఆ నోట్లు రద్దు చేస్తారా? ఆర్బీఐ ఏమంటోంది  - no plans of withdrawing old Rs 100 notes says rbi
close

Updated : 25/01/2021 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నోట్లు రద్దు చేస్తారా? ఆర్బీఐ ఏమంటోంది 

ముంబయి: దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్‌ చేసింది. దేశంలో రూ.100, రూ.10, రూ.5 సిరీస్‌ కరెన్సీ నోట్లు చలామణిలోనే ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ ఉపసంహరించుకోబోమని తెలిపింది. 

2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 పాత నోట్లు రద్దు చేసినప్పటికీ.. రూ. రూ.5, రూ.10, రూ.100లను మాత్రం కొనసాగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.  అంతేకాకుండా రూ.10 నుంచి రూ.2వేల వరకు కొత్త నోట్లు, నాణేలు సైతం ముద్రిస్తోంది.  ఈ నేపథ్యంలో ఇప్పటికే చలామణిలో ఈ పాత నోట్ల విషయంలో మార్చి నెలలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చడమో, లేదంటే వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవడమో జరుగుతుందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చి చెబుతూ ఆర్బీఐ ట్విటర్‌లో ప్రకటించింది. 

ఇదీ చదవండి..

 వాహ‌నం న‌డిపితేనే ప్రీమియం చెల్లించండి   Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని