9 నెల‌ల్లో 52 ల‌క్ష‌ల మంది చేరారు - over-52-lakhs-new-subscribers-for-atal-pension-yojana-in-9-months
close

Updated : 09/01/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

9 నెల‌ల్లో 52 ల‌క్ష‌ల మంది చేరారు

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ పెన్షన్ పథకంలో 2020 డిసెంబర్ 31 వరకు 52 లక్షలకు పైగా కొత్త చందాదారులు చేరారు. దీనితో మొత్తం నమోదు 2.75 కోట్ల మైలురాయిని దాటింది. 2020-21 మధ్యకాలంలో కేవ‌లం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ద్వారా 15 లక్షలకు పైగా కొత్త చందాదారులు అటల్ పెన్షన్ యోజన (ఎపివై) లో చేరారు. 

భార‌త‌ పౌరులు, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న ఏ వ్యక్తి అయినా  అటల్ పెన్షన్ యోజనకు అర్హులు.  అటల్ పెన్షన్ పథకం ఐదు స్థిర నెలవారీ పెన్షన్ ఎంపికలను అందిస్తుంది. వెయ్యి రూపాయ‌ల నుంచి రూ.5 వేల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. క‌రోనా మహమ్మారి కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 52 లక్షలకు పైగా కొత్త చందాదారులను చేరడం విశేషం.

 అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప్ర‌భుత్వ  హామీ‌ పెన్షన్ పథకం. ఇందులో చేరితే 60 ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత‌ చందాదారులకు మూడు రెట్ల‌ ప్రయోజనాలను అందిస్తుంది. చందాదారుడు మ‌ర‌ణిస్తే  జీవిత భాగస్వామికి అదే హామీ పెన్ష్ ల‌భిస్తుంది, వారి నామినీలకు 60 సంవత్సరాల వయస్సు వరకు జ‌మ చేసిన‌ పెన్షన్ వ‌స్తుంది. ఈ పెన్షన్ పథకాన్ని ఎన్‌పీఎస్‌ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) నిర్వహిస్తుంది.

జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రచారాలు, బ్యాంకర్లతో నిరంతరం పాల్గొనడం, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) సమావేశాల్లో పాల్గొనడం, మీడియా ద్వారా ప్రచారం , ఎపివై డిజిటల్ ఆన్-బోర్డింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ పథకాన్ని ప్రాచుర్యం పొందే ప్రయత్నాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పిఎఫ్‌ఆర్‌డిఏ తెలిపింది. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని